రాగి పాత్రల్లో ఆ ప‌దార్థాలు అస్స‌లు ఉంచ‌కూడ‌ద‌ట‌..తెలుసా?

ఇటీవ‌ల కాలంలో మ‌ళ్లీ రాగి పాత్ర‌ల వినియోగం భారీగా పెరిగింది.ప్లాస్టివ్ వ‌స్తువుల‌ను ప‌క్క‌న పెట్టేసి చాలా మంది రాగి పాత్ర‌ల‌నే వినియోగించ‌డం స్టార్ట్ చేశారు.

 Those Foods Should Not Be Kept In Copper Vessels At All! Copper Vessels, Foods,-TeluguStop.com

రాగి పాత్ర‌ల‌ను వాడ‌టం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌నూ పొందొచ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుందని, అంటు వ్యాధులు ద‌రి చేర‌కుండా ఉంటాయ‌ని, బ‌రువు త‌గ్గుతార‌ని, గుండె సంబంధిత వ్యాధులు వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంద‌ని, ర‌క్త పోటు అదుపులో ఉంటుంద‌ని చెప్ప‌డంతో.

త్రాగే నీటిని నిల్వ చేసుకోవడానికి, ఆహారాన్ని వండు కోవడానికి, వండిన ఆహారం తినడానికి.ఇలా ర‌క‌ర‌కాల అవ‌స‌రాల కోసం రాగి పాత్ర‌ల‌నే ఉప‌యోగిస్తున్నారు.

అయితే రాగి పాత్ర‌ల వ‌ల్ల ఎన్ని ల‌భాలు ఉన్న‌ప్ప‌టికీ.వాటిల్లో కొన్ని కొన్ని ఆహార ప‌దార్థాల‌ను అస్స‌లు ఉంచ‌రాదు.ఆ ఆహార ప‌దార్థాలు ఏంటీ.? ఎందుకు ఉంచ‌రాదు.? అన్న విష‌జ్ఞాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.సాధార‌ణంగా చాలా మందికి ఉద‌యాన్నే నిమ్మ ర‌సం తాగే అల‌వాటు ఉంటుంది.

ఈ క్ర‌మంలోనే రాగి గ్లాస్‌లో తీసుకుని సేవిస్తుంటారు.కానీ, రాగి గ్లాస్‌తో నిమ్మ ర‌సం తీసుకుంటే.

గ్యాస్‌, ఎసిడిటీ మ‌రియు క‌డుపు నొప్పి వంటి స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడ‌తాయి.

Telugu Benefitscopper, Copper Vessels, Items, Foods, Tips, Latest, Effectscopper

అలాగే కొంద‌రు రాగి పాత్ర‌లో పాల‌ను నిల్వ చేస్తుంటారు.అలా చేయ‌డం వ‌ల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే రిస్క్ కాస్త ఎక్కువ‌గా ఉంటుంది.అందుకే ఇక‌పై రాగి పాత్ర‌ల్లో పాల‌ను ఉంచ‌కండి.

పాలు మాత్ర‌మే కాదు పెరుగు, జున్ను వంటి వాటినీ రాగి పాత్ర‌ల్లో ఉంచ రాదు.

ప‌చ్చ‌ళ్లను సైతం కొంద‌రు రాగి పాత్ర‌ల్లో పెడుతుంటారు.

కానీ, రాగి పాత్ర‌ల్లో పెట్టిన ప‌చ్చ‌ళ్ల‌ను తీసుకుంటే.వాంతులు మ‌రియు జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంటుంది.

ఇక రాగి పాత్ర‌ల్లో మ‌జ్జిగ‌, ల‌స్సీలు, పుల్ల‌టి ఆహార ప‌దార్థాల‌నూ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఉంచ కూడ‌దు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube