కేంద్ర పరిశీలన బృందం ఆసుపత్రిలో ఏం చూశారు? ఏం చేశారు?

సూర్యాపేట జిల్లా:సర్కార్ దవాఖానా సకల సౌలతులతో ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కలిగి ఉంటుంది.దీని కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దవాఖానాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తాయి.

 What Did The Central Inspection Team See In The Hospital? What Did You Do?-TeluguStop.com

ఆ నిధులను ఆసుపత్రి అభివృద్ధి కమిటీ పర్యవేక్షణలో సౌకర్యాలు మెరుగుపరచి రోగులకు అన్ని రకాల సేవలు అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది.ఇదంతా అంతా సక్రమంగా జరిగితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో తంతు.

కానీ,సూర్యాపేట జిల్లాలో ఆంధ్రా సరిహద్దు ప్రాంతంగా,నిత్యం రోడ్డు ప్రమాదాలకు నిలయంగా ఉండే 65వ,జాతీయ రహదారిపై దినదినాభివృద్ధి చెందుతున్న కోదాడ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి సంగతి మాత్రమే భిన్నంగా ఉంది.పేరుకు ఏరియా ఆస్పత్రి కానీ, ఇక్కడ ఎలాంటి వైద్య సేవలు అందుబాటులో ఉండవు.

రోడ్డు ప్రమాదం జరిగి ఇక్కడికి వస్తే మొదటి గంటలో జరగాల్సిన గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్ కు కూడా దిక్కులేని పరిస్ఠితిలో ప్రైవేట్ హాస్పిటల్స్ ని ఆశ్రయించాల్సిన వస్తుంది.లేకుంటే 50కి.

మీ.దూరంలో ఉన్న జిల్లా కేంద్రంలోని పెద్దాసుపత్రికి తరలించాలి.ఈ లోపు సరైన సమయంలో అందాల్సిన చికిత్స అందక ప్రాణాలు గాల్లో కలిసిన విషాద సంఘటనలు అనేకం ఉన్నాయి.ఆసుపత్రి పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం తెల్చిందేమిటి?ఈ పరిస్థితుల్లో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పరిశీలన బృందం అధ్యక్షురాలు జ్యోతిరావు,సభ్యులు భూపెందర్ లు,డాక్టర్ అమీన్,డాక్టర్ తపస్,డాక్టర్ గౌరవ్,రాష్ట్ర అధికారుల బృంద సభ్యులు డాక్టర్ రామకృష్ణ,జేవి.శ్రీనివాసరావు సోమవారం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు.ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు.

విషయం తెలుసుకున్న కోదాడ పట్టణ సామాజిక కార్యకర్తలు కుదరవెల్లి బసవయ్య,పొడుగు హుస్సేన్,జలగం సుధీర్ లు ఆసుపత్రికి చేరుకుని ఖాళీగా ఉన్న వైద్యుల వివరాలు, ఫ్యాన్లు,ఏసిలు లేకపోవటం,యాక్సిడెంట్ అయ్యాక మొదటి గంటలో జరగాల్సిన గోల్డెన్ అవర్ ట్రీట్ మెంట్ నిర్లక్ష్యం, హస్పిటల్ అభివృద్ది కమిటి సమవేశాలు లేకపోవటం, కొంతమంది వైద్యుల నిర్లక్ష్యపు వైఖరి,కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగం మీద స్పష్టత లేకపోవటం,దవఖాన స్థలం ఆక్రమణలు,అనుమతులు లేని ప్రైవేట్ దవఖానాలపై చర్యలు వంటి పలు అంశాలను కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు.ఈ అంశాలపై కేంద్రం బృందం స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం సుమారు 60% నిధులు రాష్ట్ర రాష్ట్రానికి పంపుతున్నదని,దానికి అదనంగా 40% నిధులను రాష్త్ర ప్రభుత్వం కలిపి ప్రభుత్వ వైద్యశాలల్లో అభివృద్ధి చేయాలని అన్నారు.

కేంద్రం పంపే నిధులు జిల్లా వైద్యాధికారి పంపే ప్రపొజల్స్ మరియు నివేదికలు,యూసేజ్ సర్టిఫికెట్ ల ఆధారంగా విడుదల చేస్తారని చెప్పారు.అనేకసార్లు సరైన ప్రపొజల్స్ లేకపోవటంవల్ల నిధులు వెనక్కి వెళ్ళడం జరుగుతుందన్నారు.

హాస్పిటల్ అభివృద్ది కమిటి సమావేశాలు రెగ్యులర్ గా జరగాలని,వాటిలో సామాజిక కార్యకర్తలకు చోటు ఇవ్వాలని హాస్పిటల్ సూపరిండెంటెంట్ కు సూచించారు.దీనిని బట్టి దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదనే చందంగా ప్రభుత్వాలు ఆసుపత్రుల అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా,అధికార యంత్రాంగం సరైన దృష్టి పెట్టకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రులు అరకొర వసతులతో నడుస్తున్నాయని సామాజిక కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు.60% నిధులు ఇయ్యనీకి కేంద్రం రెడీగా ఉన్నప్పుడు,రాష్ట్రం ఇచ్చే 40% నిధుల సంగతేందని ప్రశ్నిస్తున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటా చలం,ఆస్పత్రి సూపరంటెండెంట్ డాక్టర్ రజిని,డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ నిరంజన్,డాక్టర్ హర్షవర్ధన్,జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ వెంకటరమణ,జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి,జిల్లా మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ జయ, అంజయ్య,వీరయ్య,కిరణ్,భూతరాజు సైదులు,యాదగిరి, థామస్,అరుణ,సాంబశివరావు ఆరోగ్య శాఖ అధికార యంత్రాంగం అంతా హాజరైనా సామాజిక కార్యకర్తలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవారు లేకపోవడం గమనార్హం.

ఇదిలా ఉంటే కేంద్ర,రాష్ట్ర పరిశీలన బృందం కూడా సామాజిక కార్యకర్తలు ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే తాము ఫిర్యాదుల కోసం రాలేదని,సలహాల కోసం వచ్చినమని చెప్పడం కొసమెరుపు.ప్రభుత్వాలు ఏవైనా ప్రభుత్వ ఆసుపత్రుల తీరు మాత్రం మారదని,ప్రభుత్వ వైద్యం, నిర్లక్ష్యం చేయడం వలన లక్షలాది మంది పేద ప్రజల ప్రాణాలు అర్డాంతరంగ ముగిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube