యాదాద్రి భువనగిరి జిల్లా:అరుణాచల్ ప్రదేశ్( Arunachal Pradesh ) లో విధి నిర్వహణలో ఉండగా హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసిన అమర జవాన్ కల్నల్ వుప్పల వినయ్ భానురెడ్డి అంత్యక్రియలు అధికార లాంచనలతో జరిగేందుకు ఆయన స్వస్థలం యాదాద్రి జిల్లా బొమ్మలరామారంలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది.రాష్ట్ర ప్రభుత్వం తరుపున రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి హాజరై కల్నల్ వీవీబీ రెడ్డి భౌతికకాయానికి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం కల్నల్ వీవీబీ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యురాలు గొంగొడి సునీత మహేందర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళశేఖర్ రెడ్డి,యాదాద్రి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి,రాచకొండ కమీషనర్ చౌహాన్ తదితరులు పాల్గొని కల్నల్ వీవీబీ రెడ్డికి నివాళులు అర్పించారు.