ముఖంపై అవాంఛిత రోమాలను క్ష‌ణాల్లో తొల‌గించే సూప‌ర్ మాస్క్ ఇదే!

ముఖంపై అవాంఛిత రోమాలు చూసేందుకు అస‌హ్యంగా క‌నిపించ‌డ‌మే కాదు.చ‌ర్మ కాంతిని కూడా త‌గ్గించేస్తాయి.

 Effective Mask For Facial Hair Removal ,  Face Mask , Facial Hair Removal , Faci-TeluguStop.com

అందుకే ఫేషియల్ హెయిర్ ను రీమూవ్ చేయించుకోవ‌డం కోసం త‌ర‌చూ బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్తుంటారు.అయితే ఇంట్లో కూడా ముఖంపై అవాంఛిత రోమాలను తొల‌గించుకోవ‌చ్చు.

అందుకు ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ ఫేస్ మాస్క్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి ఆ సూప‌ర్ మాస్క్ ఏంటీ.? ఎలా త‌యారు చేసుకోవాలి.? వంటి విష‌యాల‌ను లేట్ చేయ‌కుండా ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ ఇన్‌స్టెంట్ కాఫీ పౌడ‌ర్‌, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాట‌ర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఇందులో వ‌న్ టేబుల్ స్పూన్ జెలటిన్ పౌడ‌ర్ వేసి మ‌ళ్లీ క‌లుపుకోవాలి.

ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని వాట‌ర్ పోయాలి.వాట‌ర్ బాగా మ‌రిగిన వెంట‌నే.

అన్ని ప‌దార్థాలు క‌లిపి పెట్టుకున్న గిన్నెను పెట్టి డ‌బుల్ బాయిల‌ర్ మెథ‌డ్‌లో రెండు నిమిషాల పాటు వేడి చేయాలి.

Telugu Tips, Face, Facial, Facial Removal, Latest, Skin Care, Skin Care Tips-Tel

హీట్ చేసిన మిశ్ర‌మాన్ని చ‌ల్లార‌బెట్టుకుని.ఆపై ముఖానికి అప్లై చేసుకోవాలి.ప‌దిహేను నుంచి ఇర‌వై నిమిషాల పాటు ఆరినిచ్చి.

అప్పుడు మాస్క్‌ను మృదువుగా తొలగించాలి.ఆ వెంట‌నే వాట‌ర్‌తో ఫేస్‌ను క్లీన్ చేసుకుని రెండు ఐస్‌ క్యూబ్స్‌తో రుద్దాలి.

ఇప్పుడు త‌డి లేకుండా ట‌వ‌ల్‌తో ఫేస్‌ను క్లీన్ చేసుకుని ఏదైనా మాయిశ్చరైజర్ రాయాలి.

ఇలా చేస్తే ముఖంపై వ‌చ్చిన అవాంఛిత రోమాలు తొల‌గి పోవ‌డ‌మే కాదు.

మురికి, మృత‌క‌ణాలు సైతం పోయి స్కిన్ మృదువుగా, కాంతి వంతంగా మారుతుంది.అలాగే కొంద‌రు ఆయిలీ స్కిన్‌తో తీవ్రంగా మ‌ద‌న ప‌డుతుంటారు.

అలాంటి వారు పైన చెప్పిన మాస్క్‌ను వేసుకుంటే ఆయిలీ స్కిన్ స‌మ‌స్య నుంచి విముక్తి పొందొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube