తెలుగు చిత్ర పరిశ్రమలో రొమాన్స్ కామెడీ యాక్షన్ హారర్ అన్నీ జానర్స్ ముగిసిపోయాయి.ఇక ఇప్పుడు తెలుగు హీరోలు అందరి కన్ను కొత్త జోనర్ పి పడినట్లు తెలుస్తోంది.
అదే స్పై నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలపై.ఈ క్రమంలోనే ప్రస్తుతం సౌత్ హీరోలు అందరూ కూడా స్పై నేపథ్యంలో తెరకెక్కె సినిమాలో నటించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
కేవలం సౌత్ లోనే కాదు నార్త్ హీరోలు కూడా ఇక ఇలాంటి జోనర్ పైన కన్నేసినట్లు తెలుస్తోంది.అయితే ఈ జానర్ పెద్ద హిట్టయినట్లు ఇప్పటివరకూ హిస్టరీలో లేదు.
కానీ తెలుగు హీరోలకు మాత్రం స్పై జానార్ నచ్చేసినట్లు తెలుస్తోంది.
తమిళ హీరో ఇళయదళపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న బీస్ట్ మూవీ కూడా స్పై యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
సినిమాలో స్టైలిష్ స్పై పాత్రలో విజయ్ కనిపించబోతున్నారట.నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ యాక్షన్ మరో లెవెల్ లో ఉండబోతోందని తెలుస్తోంది.ఇటీవల విడుదలైన ట్రైలర్కు ఆడియన్స్ నుంచి ఎంతలా ఆదరణ వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇటీవలే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ కొట్టిన అఖిల్ సైతం స్పై మూవీతోనే ఆడియన్స్ను పలకరించ పోతున్నాడు.లవర్ బాయ్ గా కనిపించిన అఖిల్ కండలు పెంచి నేరస్తుల వెంటపడుతున్నాడు.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఏజెంట్ అనే సినిమా తెరకెక్కుతోంది.
సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నాడు అంటుంది.
ఇక మహేష్ బాబు మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన స్పై సినిమా స్పైడర్ ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ కాలేకపోయింది.
కానీ స్టైలిష్ లుక్ లో మహేష్ మాత్రం ప్రేక్షకులను ఆకర్షించాడు.
అయితే ఇలా కొంతమంది హీరోలు చేసిన స్పై సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.కానీ సినీ హీరో రాజశేఖర్ చేసిన పిఎస్వి గరుడ వేగా సినిమా మాత్రం స్పై నేపథ్యంలో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది.అడవి శేషు నటించిన గూడచారి కూడా మంచి సక్సెస్ అయ్యి అందరి చూపులు ఆకర్షించింది.
కేవలం టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో షారుక్ ఖాన్ హృతిక్ రోషన్ సల్మాన్ ఖాన్ లాంటి హీరోలందరూ కూడా స్పై యాక్షన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అని తెలుస్తోంది.