ఏపీని శ్రీలంక తో పోల్చేస్తున్నారుగా ? 

శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉంది.  ఆర్థికంగా  , రాజకీయంగా తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.

 Is The Ap Being Compared To Sri Lanka, Srilanka, Ap, Tdp, Jagan, Chandrababu, Cb-TeluguStop.com

సామాన్యుడు కొనలేని స్థాయిలో నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి.పెట్రోల్ ,డీజిల్ ధరలతో పాటు అన్ని భారీగా ధరలు పెరిగిపోవడం తో ప్రజలు సతమతం అవుతున్నారు.

శ్రీలంకలో చోటుచేసుకున్న పరిణామాలపై ప్రపంచ దేశాలు కూడా ఆందోళన చెందుతున్నాయి.ఉల్లిపాయలు 150, లీటర్ పెట్రోల్ ధర 250, ఒక యాపిల్ వంద రూపాయలు, ఒక కోడి గుడ్డు ధర 50 రూపాయల వరకు పెరిగిపోయాయి.

అయితే శ్రీలంక లో చోటుచేసుకున్న పరిణామాలను గుర్తుచేస్తూ ఏపీ ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు  హేళన చేస్తున్నాయి.

 త్వరలోనే శ్రీలంక లో చోటుచేసుకున్న తరహా పరిణామాలు ఏపీలోనూ చేసుకోపోతున్నాయని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఇప్పుడు విమర్శలు మొదలు పెట్టింది.

ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోబోతోంది అని, కోడి గుడ్డు 1000 రూపాయలకు పెరిగే అవకాశం ఉందని స్వయంగా టిడిపి అధినేత చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు.ఇక టీడీపీ అనుకూల మీడియాలోను దీనిపై అనేక కథనాలు వెలువడుతున్నాయి.

  త్వరలోనే శ్రీలంక సంక్షోభం ఏపీలోనూ కనిపించబోతోంది అని, అప్పులు లెక్కకు మించి చేయడం,  సంక్షేమ పథకాలు విపరీతంగా అమలు చేస్తుండడంతో త్వరలో ఏపీ శ్రీలంక మాదిరిగా మారబోతోంది అంటూ టీడీపీ అనుకూల మీడియా లో పెద్ద ఎత్తున కథనాలు వెలువడుతున్నాయి.
 

Telugu Ap, Ap Tdp, Bonda Uma, Chandrababu, Jagan, Lokesh, Srilanka, Ysrcp-Telugu

ఇది నిపుణులు చెబుతున్న మాటగా టీడీపీ అనుకూల మీడియా లో ప్రచారం చేస్తున్నారు.అంతే కాదు ఏపీ లో చోటుచేసుకున్న ఆర్థికపరమైన పరిణామాల గురించి కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రధాని నరేంద్ర మోదీ కి ఫిర్యాదు చేసినట్లు ఆ కథనాలు ఉన్నాయి.పరిపాలన చేయడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని,  అందుకే ఈ తరహా పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని విధంగా తెలుగుదేశం పార్టీతో పాటు ఆ పార్టీ అనుకూల మీడియా లోనూ ప్రచారం అవుతుండడం తో దీనిపై సోషల్ మీడియాలోనూ చర్చ తీవ్రంగా నడుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube