పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సుజనాచౌదరి మంగళవారం నాడు రాజ్యసభ లో కీలక వ్యాఖ్యలు చేశారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమని పేర్కొన్నారు.
మళ్లీ విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో సుజనాచౌదరి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రమే చేపట్టాలని డిమాండ్ చేశారు.ప్రాజెక్టు నిర్మాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండానే కేంద్రం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు చేపట్టాలని.
వీలైనంత త్వరగా పూర్తి చేయాలనీ సూచించారు.
అంతేకాకుండా రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన సందర్భాన్ని కూడా సభలో మరో సారి గుర్తు చేశారు.
ఏపీకి జీవనాడి లాంటి ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆలస్యం అయితే రాష్ట్రానికి నష్టమని.ఆందోళన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తో సంబంధం లేకుండా కేంద్రం పోలవరం నిర్మాణ బాధ్యతలను తీసుకొని త్వరగా పూర్తి చేయాలని సుజనా చౌదరి పేర్కొన్నారు.







