ఈ దుంపలు తింటే మధుమేహం మాయం!

చామదుంపలు మనకు విరివిగా లభిస్తాయి.అయితే చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడరు.

 Diabetes,tar Root, Anti-inflammatory Properties, Sodium,health Benefits-TeluguStop.com

ఇది కొద్దిగా జిగురు, చేదుగా ఉండటం వల్ల పచ్చివి తినడానికి ఇష్టపడరు.కానీ వీటిని కూర వండి తినడం ద్వారా ఎన్నో పోషక విలువలను మన శరీరానికి అందుతాయి.

తరుచూ వీటిని తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఎన్నో రకాల వ్యాధులను తగ్గించుకోవచ్చు.ఈ దుంపలను తరచూ మన ఆహార పదార్థాలలో తీసుకోవటంవల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇక్కడ తెలుసుకుందాం.

చామదుంపలలో అధికంగా ఫైబర్, కార్బోహైడ్రేట్ లు పుష్కలంగా లభిస్తాయి.అంతేకాకుండా వీటిలో విటమిన్ బి,సి,ఎ, మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్, పొటాషియం వంటి ఎన్నో పోషక విలువలతో కలిగి ఉన్నాయి.

ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ కార్బోహైడ్రేట్లు ఉండటం వల్ల జీర్ణక్రియకు ఎంతో ఉపయోగపడుతుంది.మధుమేహంతో బాధపడే వారు ఎటువంటి సందేహం లేకుండా ఈ దుంపలను తినడం ద్వారా గ్లూకోజ్ స్థాయిలు పెరగవు.

అంతేకాకుండా ఇంట్లోకి రక్తంలో కలిసి పోవడం ద్వారా.మన రక్తంలో చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచుతుంది.
ఇందులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ ,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మన శరీరంలో క్యాన్సర్ కణాలతో పోరాడుతాయి.అధిక బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఈ దుంపలను వారి ఆహారంలో చేర్చుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గుతారు.

ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ దుంపలను తినడం ద్వారా వారిలో ఉండేటటువంటి వాంతి, వికారం వంటి లక్షణాలు తగ్గిపోయి, వారి గర్భస్థ శిశువు పెరుగుదలకు దోహదపడతాయి.

అధిక రక్తపోటుతో బాధపడేవారు చామదుంపలను తినడం ద్వారా ఇందులో ఉన్న సోడియం, రక్తపోటును నియంత్రణలో ఉంచడమే కాకుండా, ఎటువంటి గుండె సమస్యల నుంచి అయినా మనల్ని కాపాడుతుంది.

అంతేకాకుండా క్యాల్షియం అధిక మొత్తంలో ఉండటంవల్ల ఇవి ఎముకలు దృఢత్వానికి దోహదపడతాయి.యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్ నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది.

విటమిన్ ఏ అధికంగా ఉండటం వల్ల కంటికి సంబంధించినటువంటి సమస్యలు అన్ని తొలగిపోతాయి.చామదుంపలను ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం ద్వారా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube