ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని అనుకుంటూ ఉన్నారు.అందులో ముఖ్యంగా తల వెంట్రుకల కోసం ఎన్నో రకాల ఔషధాలను ఉపయోగిస్తూ ఉన్నారు.
కానీ ఎన్ని చేసినా సరే చిన్న వయసులోనే వెంట్రుకలు రాలిపోతున్నాయి.ఇంకొందరికి అయితే వెంట్రుకలు చిన్న వయసులోనే తెల్లబడిపోతు ఉన్నాయి.
ఇలాంటివారు మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటారు.తెల్ల వెంట్రుకలు( white hair ) వారి కాన్ఫిడెన్స్ ను దెబ్బతిస్తాయి.
దాంతో వారు తెల్ల వెంట్రుకలు పోగొట్టుకోవడానికి వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉన్నారు.అయితే వారికి ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు.
ఎందుకంటే ఇంట్లోనే బ్లాక్ వాటర్( Black water ) తయారు చేసుకుని, ఆ వాటర్ స్ప్రే చేయడం వల్ల తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

దీన్ని వల్ల తెల్లగా మారిన వెంట్రుకలు కూడా నల్లగా మారుతూ ఉంటాయి.దీన్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దానిమ్మ తొక్క, ( Pomegranate Peel )నిమ్మ పై తొక్క, వాల్నట్ పెంకులు, మూడు కప్పుల నీరు ఉంటే సరిపోతుంది.
ముందుగా గయాస్ మీద ఇనుప కడాయి ఉంచాలి.అందులో మూడు కప్పుల నీరు పోసి వేడి చేసుకోవాలి.తర్వాత అందులో నిమ్మకాయ తొక్కులు వేసి బాగా మరగనివ్వాలి.ఒక పది నిమిషాలు వేడి చేసిన తర్వాత స్పష్టమైన నీరు నల్లగా మారుతుంది.
తర్వాత వాటిని ఆ నీరు చల్లారిన తర్వాత ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.ఆ నీటిని మన జుట్టు మీద బాగా స్ప్రే చేసుకోవాలి.

ఒక గంట వరకు అలాగే ఉంచుకున్న తర్వాత స్నానం చేయాలి.మృదువైన షాంపూతో స్నానం చేస్తే సరిపోతుంది.ఇలా క్రమం తప్పకుండా స్ప్రే చేసుకున్న తర్వాత తల స్నానం చేస్తే సరిపోతుంది.ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు నల్లబడుతుంది.అయితే పూర్తిగా జుట్టు తెల్లబడిన వారు ఈ బ్లాక్ వాటర్ లో గోరింటాకు పొడి( Henna Powder ), అలాగే టీ ఆకులు( Tea leaves ), కాఫీ పొడి కూడా వేసుకోవచ్చు.ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఆ పాన్ లో పేస్టును తలకు అప్లై చేసుకుని నాలుగు నుంచి ఐదు గంటల పాటు అలాగే ఉంచాలి.
ఈ పేస్టును పెట్టుకునే ముందు జుట్టును బాగా శుభ్రం చేసుకోవాలి.ఇక ఈ పేస్టు ఆయిల్ తో ఉంటే జుట్టు మీద అంత ఎఫెక్ట్ చూపించదు.







