మన హిందూ సంప్రదయాల ప్రకారం.పూజలు, పునస్కారాలు చేయడం మనకు అలవాటు.
అయితే చాలా మంది హోమాలు, జపాలు చేయడానికి, చేయించుకోవడానికి చాలా ఆసక్తి కనబరుస్తుంటారు.దోషాలు ఉన్న వారు దోషాలు పోగొట్టుకునేందుకు.
అలాగే మంచి జరగాలని మరికొందరు చేయించుకుంటూ ఉంటారు.కానీ ఆర్థికంగా హోమాలు, జపాలు చేయించ లేని స్థితిలో ఉంటే….
ఈ విధంగా చేయాలని మన పురాణాలు చెబుతున్నాయి.దాని వల్ల హోమం చేసినంతటి ఫలం లభిస్తుందని కూడా వివరిస్తుంటారు.
స్తోమత లేనపుడు, శాంతి క్రియలు చేయలేకపోయినప్పటికీ దోషము కలిగిన గ్రహములకు సంబంధించిన ధ్యాన శ్లోకములు నిత్యము కనీసం 11 సార్లు పఠించాలి.గ్రహ సంఖ్యను బట్టి అన్నిసార్లు యధాశక్తిగా కుదిరినన్నిరోజుల్లో చేయవచ్చు.
అదే విధంగా నవ గ్రహములకు ప్రదక్షిణలు చేయడం వలన కూడా ఉపయోగము ఉంటుంది.ఆ గ్రహాలకు సంబంధించిన వారం రోజు ఉపవాసం చేయవచ్చు.
సంబంధించిన గ్రహమునకు సాధారణ స్థాయిలో కనీసం అష్టోత్తరము పూజ చేసిన మంచిదే.లేదా ఇంటి వద్దనే గ్రహములకు సంబంధించిన స్తోత్రములు పారాయణ చేయవచ్చు.
రవి దోషం ఉంటే ఆదివారం, చంద్రోషం ఉంటే సోమవారం, కుజ దోషం ఉంటే మంగళ వారం, బుధ దోషం ఉంటే బుధ వారం, గురు దోషం ఉంటే గురు వారం, శుక్ర దోషం ఉంటే శుక్ర వారం, శని దోషం ఉంటే శని వారం, రాహు దోషం ఉంటే ఆది లేదా మంగళ వారం, కేతు దోషం ఉంటే మంగళ లేదా ఆదివారం ఉపవాసం ఉంటే దోష నివారణ కలుగుతుంది.ఆ గ్రహమునకు సంబంధించిన ధాన్య ధానం చేసినా మంచిదే.