సోమవారం రోజు శివయ్యను ఇలా పూజించడం వల్ల.. ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు..!

సనాతన ధర్మంలో సోమవారం రోజును మహా శివుడికి( Lord Shiva ) అంకితం చేయబడిందని పండితులు చెబుతున్నారు.కాబట్టి సోమవారం రోజు శివుడిని స్మరించుకుంటూ ఉండాలని కూడా చెబుతున్నారు.

 By Worshiping Lord Shiva Like This On Monday.. Along With Happiness And Joy At-TeluguStop.com

సృష్టి లయకారుడైన శివయ్యను భక్తితో స్మరిస్తే చాలు కోరికన కోరికలు తీరుస్తాడని చెబుతున్నారు.అదే సమయంలో శివయ్య చిన్న విషయాలకు తీవ్ర కోపంతో పరిస్థితిని తారుమారు చేస్తాడని కూడా ప్రజలు నమ్ముతారు.

అటువంటి పరిస్థితులలో మీరు సోమవారం రోజు కొన్ని నియమాలను పాటిస్తూ పూజిస్తే ఖచ్చితంగా భక్తుల ఇంట సుఖసంతోషాలతో పాటు సంపదలను కూడా అనుగ్రహిస్తాడు.

Telugu Devotional, Lord Shiva, Monday, Paravathi Devi, Rudraksha, Saffron, Shiva

ఈ నేపథ్యంలో శివయ్యను సోమవారం ఆరాధించే సమయంలో భక్తులు ఈ ఐదు విషయాలను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.అప్పుడు మహా శివుడి అనుగ్రహం తన భక్తులకు లభిస్తుందని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే సోమవారం రోజు శివునికి ఉపవాసం ఉండడం అత్యంత పుణ్యఫలం అని పండితులు చెబుతున్నారు.

అలాగే వివాహిత మహిళలు సోమవారం పసుపు, కుంకుమ, గాజులు వంటి వస్తువులను దానం చేస్తే అదృష్టాన్ని సొంతం చేసుకోవచ్చు.

Telugu Devotional, Lord Shiva, Monday, Paravathi Devi, Rudraksha, Saffron, Shiva

ఇంకా చెప్పాలంటే పురుషులు, మహిళలు సోమవారం శివాలయం( Shiva temple )లో శివయ్యను దర్శించుకుని పేదలకు అన్నదానం చేయడం అత్యంత శుభ ప్రధమనీ పండితులు చెబుతున్నారు.అలాగే సోమవారం శివయ్యను పూజించేటప్పుడు నీరూ పాలతో అభిషేకం చేయాలి.అలాగే కచ్చితంగా బిల్వ పత్రాలను సమర్పించాలి.

ఇంకా చెప్పాలంటే శివునికి నువ్వులు సమర్పించడం వలన పాపాలు దూరం అవుతాయి.అలాగే సోమవారం రోజు గౌరీ శంకరుడిని కలిసి పూజించాలి.

ముఖ్యంగా చెప్పాలంటే శివాలయంలో రుద్రాక్షలను( Rudraksha ) సమర్పించాలి.అలాగే సోమవారం రోజు శివయ్య భక్తులు ఆయనకు ఇష్టమైన మంత్రాలను కూడా పఠించడం ఎంతో మంచిది.

ఈ మంత్రాలను పాటించడం వల్ల కుటుంబంలోని ఎన్నో రకాల సమస్యలు పేదరికం కూడా దూరమవుతాయి.భక్తులు ఇలా చేయడంతో పరమశివుడు ఎంతో సంతోషించి కోరిన మంచి మంచి కోరికలన్నీ తీరుస్తాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube