వామ్మో.. 30 రోజుల్లో 5 సార్లు కాటు వేసిన పాము.. అయినా కానీ..

యూపీ( Uttar Pradesh )లోని ఫతేపూర్( Fatehpur ) జిల్లాలో ఓ యువకుడిని నెల రోజుల్లోనే ఐదుసార్లు పాము కాటు వేసిన వింత ఉదంతం వెలుగులోకి వచ్చింది.కానీ చికిత్స తర్వాత ప్రతిసారీ యువకుడు కోలుకున్నాడు.

 The Snake Bitten 5 Times In 30 Days In Uttar Pradesh, Snake Bites, Up, Hospital-TeluguStop.com

పాము కాటుకు గురైన యువకుడు మళ్లీ మళ్లీ ఎలా కోలుకుంటున్నాడోనని చికిత్స అందిస్తున్న వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.పాము భయంతో ఆ యువకుడు తన ఇంటిని వదిలి అత్త వారి వద్ద నివాసం ఉండడం మొదలు పెట్టాడు.

అయినా కానీ పాము అతన్ని అక్కడ కూడా వదలలేదు.అత్త ఇంట్లో కూడా పాము అతడిని బలిపశువును చేసింది.

ఈ ఘటనతో యువకుడితో పాటు అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.వారు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు.

Telugu Times, Bite, Fatehpur, Snake, Snake Bites, Uttar Pradesh-Latest News - Te

ఈ ఘటన ఫతేపూర్ జిల్లాలోని మాల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌరా గ్రామంలో జరిగింది.ఇక్కడ నివసించే వికాస్ దూబే( Vikas Dubey ) (24) నెలన్నర వ్యవధిలో ఐదుసార్లు పాము కాటుకు గురైనప్పటికీ, చికిత్స తర్వాత అతను కోలుకున్నాడు.ఇప్పటికీ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఎందుకంటే, ఇటీవల ఓ పాము అతన్ని కాటేసిందట.వికాస్ తెలిపిన వివరాల ప్రకారం.జూన్ 2వ తేదీ రాత్రి 9 గంటలకు మంచం దిగుతుండగా తొలిసారి పాము కాటుకు గురయ్యాడు.

ఆ తర్వాత కుటుంబసభ్యులు అతడిని ఓ ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌కు తీసుకెళ్లారు.రెండు రోజులు అక్కడే అడ్మిట్‌ అయ్యాడు.

చికిత్స అనంతరం కోలుకుని ఇంటికి వచ్చారు.ఇది సాధారణ సంఘటన అని కుటుంబ సభ్యులు భావించారు.

అయితే జూన్ 10వ తేదీ రాత్రి మళ్లీ పాము కాటేసింది.దింతో అతనిని వారి కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఈసారి కూడా చికిత్స అనంతరం కోలుకోవడం విశేషం.అయితే పాము చూసి భయపడి జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాడు.

అయితే ఏడు రోజుల తర్వాత (జూన్ 17) న ఇంట్లో మరోసారి పాము కాటువేయడంతో పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు.తర్వాత అదే ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు.

Telugu Times, Bite, Fatehpur, Snake, Snake Bites, Uttar Pradesh-Latest News - Te

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.నాలుగోసారి పాము ముందు జరిగిన ఘటన తర్వాత నాలుగో రోజులేకే మరోసారి వికాస్‌ను పాము కాటేసింది.కుటుంబసభ్యులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు.అయితే ఈసారి కూడా చికిత్స అనంతరం ప్రాణాలతో బయటపడ్డాడు.అలాంటి పరిస్థితిలో.

బంధువులు, డాక్టర్ వికాస్‌ను కొన్ని రోజులు వేరే చోటికి పంపాలని సూచించారు.సలహాను అనుసరించి, వికాస్ తన అత్త ఇంట్లో (రాధానగర్) నివసించడానికి వెళ్ళాడు.

అయితే గత శుక్రవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో మళ్లీ ఇంట్లో పాము కాటుకు గురైంది.ఆ తర్వాత కుటుంబసభ్యులు అతన్ని అదే ఆసుపత్రిలో చేర్పించారు.

ప్రస్తుతం వికాస్ చికిత్స పొందుతున్నాడు.ఈ ఘటనపై జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు.భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయోనని కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు.

పాము మళ్లీ వికాస్‌ను కాటేస్తుందని వారు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube