మన భారతదేశంలో ఎన్నో ప్రాతనమైన పుణ్యక్షేత్రాలు ఆలయాలు ఉన్నాయి.ఈ పుణ్యక్షేత్రాలకు ప్రతిరోజు ఎన్నోవేల మంది భక్తులు తరలివచ్చి భగవంతునికి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు.
ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడి వల్ల మానవులే కాకుండా దేవతలు కూడా మేలుపొందుతున్నారని పురాణాలు చెబుతున్నాయి.మన దేశ వ్యాప్తంగా సూర్యుడికి సంబంధించిన దేవాలయాలు చాలా ఉన్నాయి.
అందులో ఒడిశాలోని కోణార్క్ దేవాలయం కూడా ఒకటి అని దాదాపు అందరికీ తెలిసిందే.అయితే బీహార్( Bihar ) లోని సూర్య భగవానుడి దేవాలయం కోణార్క్ దేవాలయానికి ఏమాత్రం తక్కువ కాదు అని కచ్చితంగా చెప్పవచ్చు.
మహాభారతం, సూర్య పురాణాలలో కూడా ప్రస్తావించిన దేవాలయం బీహార్ లోని సహర్సా జిల్లాలోని కందహాలో ఉంది.సహస్ర జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి 16 కిలో మీటర్ల దూరంలో ఉన్న మహిషి బ్లాక్‌లోని కందహా గ్రామంలో ఉన్న సూర్య దేవాలయం( Sun Temple ) ప్రాముఖ్యత ఒడిశాలోని కోణార్క్ సూర్యదేవాలయం కంటే తక్కువ కాదు.

ఇక్కడ చాలా పురాతనమైన సూర్య దేవాలయం ఉంది.నల్ల రాతితో చేసిన సూర్య భగవానుడి అరుదైన కళాత్మక విగ్రహం ఇక్కడ నిర్మించారు.విగ్రహం నుదుటి పై మేష రాశి చక్రం చెక్కబడి ఉంది.ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి కుమారుడైన శంబు( Shambu ) దీనిని స్థాపించాడని స్థానికులు చెబుతున్నారు.వైశాఖ మాసంలో సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశించినప్పుడు మొదటి కిరణం ఈ దేవాలయంలోని సూర్య విగ్రహం మరియు దాని రథం పై పడుతుందని ప్రజలు నమ్ముతారు.

ఈ దేవాలయంలో మొత్తం 12 రాశుల కళాఖండాలతో పాటు సూర్య యంత్రం కూడా ఉంటుంది.ఇది మాత్రమే కాకుండా ఈ దేవాలయంలో అష్టభుజి గణేష్ జీ కూర్చొని ఉన్నారు.ఇది ఏ దేవాలయంలోనైనా చాలా అరుదుగా కనిపిస్తుంది.
ఈ దేవాలయంలో అద్భుతమైన శివుని విగ్రహంతో పాటు సూర్యదేవుని భార్యల విగ్రహాలు ఉండడం మరో విశేషం.
DEVOTIONAL







