మామూలుగా కొంతమంది కొన్ని చేయకూడని పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోతూ ఉంటారు.అయితే సామాన్యులు అటువంటి పనులు చేస్తే ఎవరు పట్టించుకోరు కానీ ఒక హోదాలో ఉన్న వాళ్ళు చేస్తే మాత్రం కచ్చితంగా వారికి ట్రోల్స్ ఎదురవుతూ ఉంటాయి.
ఇక ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన వారిని మాత్రం అస్సలు వదలరు జనాలు.ఇప్పటికే చాలామంది సెలబ్రెటీలు( Celebrities ) కొన్ని వెధవ పనులు చేస్తూ మీడియా కంట పడ్డారు.
అయితే రీసెంట్ గా రష్మిక మందన్న కూడా అటువంటి పని చేస్తూ దొరికిపోయింది.దీంతో నెటిజన్స్ ఆమెను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.
అయితే అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ ప్రేక్షకులకు రష్మిక( Rashmika ) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇంట అడుగుపెట్టి.ఫస్ట్ లుక్ ది బెస్ట్ లుక్ అనిపించుకొని తన నటనకు గాను ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
ప్రస్తుత సినీ రంగంలో పాన్ ఇండియా స్థాయిలో ఓ వెలుగు వెలుగుతుంది.ఈ ముద్దుగుమ్మ తొలిసారిగా ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి తర్వాత ఆ పై వచ్చిన అంజనిపుత్ర, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పొగరు, ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు అందుకుంది.
టాలీవుడ్ లో అతి తక్కువ సినిమాలతోనే ఎక్కువ క్రేజ్ పొందింది.అంతేకాకుండా పాన్ ఇండియా స్థాయిలో నటిస్తూ.ఇండియన్ క్రష్( Indian Crush ) గా ఓ ఊపు ఊపుతుంది.

గత ఏడాది వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ ( pushpa )సినిమాలో వేరే లెవెల్ లో మెప్పించిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా తర్వాత రష్మిక క్రేజ్ మరింత ఎక్కువగా పెరిగింది.కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్( Bollywood, Kollywood ) లో వరుస అవకాశాలతో ఓ రేంజ్ లో పరుగులు తీస్తుంది.
ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ లిస్టులో రష్మిక కూడా ఒకరు.ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు అడ్వర్టైజ్మెంట్లు కూడా చేస్తూ ఉంది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.ఈమెకు బాగా ట్రోల్స్ కూడా వస్తుంటాయి.అయితే రీసెంట్ గా రష్మిక నాన్ వెజ్ యాడ్ లో నటించిన సంగతి తెలిసిందే.నిజానికి రష్మిక వెజిటేరియన్.తను ఈ విషయం గతంలోనే తెలిపింది.
దీంతో నాన్ వెజిటేరియన్ యాడ్ లో నటించడంతో ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు నెటిజన్స్.వెజిటేరియన్ అని చెప్పి నువ్వు నాన్ వెజ్ తినడం కరెక్టేనా.
నువ్వు వెజిటేరియన్ అయ్యి ఉండి ఇలాంటి యాడ్ ఎలా చేయగలిగావు అంటూ ఫైర్ అవుతున్నారు జనాలు.మరికొంతమంది విజయ్ దేవరకొండ అలవాటు చేసాడేమో అని కామెంట్స్ పెడుతున్నారు.







