అరటి చెట్టు నుంచి వచ్చే అరటి పండ్లే కాదు అరటి దూట కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఈ అరటి దూట సిటీల్లో దొరకడం కాస్త కష్టమే.
కానీ, పల్లెటూర్లలో మాత్రం ఎక్కడ బడితే అక్కడ అరటి చెట్లు ఉండటం వల్ల విరి విరిగా అరటి దూట లభ్యమవుతుంది.ఇక ఈ అరటి దూటతో చాలా మంది రకరకాల వంటలు చేస్తుంటారు.
అరటి దూట పెరుగు పచ్చడి, అరటి దూట కూర ఇలా ఎన్నో చేస్తుంటారు.అరటి దూటను జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు.
ఇలా ఎలా తీసుకున్నా అరటి దూటతో బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మధ్య కాలంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఎక్కువ శాతం మందిని వేధించే సమస్య కిడ్నీ స్టోన్స్.అయితే మూత్ర పిండాల్లో రాళ్లను కరిగించడంలో అరటి దూట అద్భుతంగా సహాయపడుతుంది.
వారంలో రెండు లేదా మూడు సార్లు అరటి దూట జ్యూస్ తీసుకుంటే కిడ్ఈ స్టోన్స్ సమస్య దూరం అవుతుంది.

ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్‌లో డీహైడ్రేషన్, శరీర వేడి, అలసట వంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తాయి.అయితే అరటి దూటను తరచూ తీసుకుంట .ఈ సమస్యలేవి దరిచేరవు.అలాగే శరీర కొవ్వును కరిగించడంలో అరటి దూట సూపర్‌గా సహాయపడుతుంది.
అందువల్ల, అరటి దూటను ఏదో ఒక రూపంలో తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వొచ్చు.
స్టొమక్ అల్సర్‌తో బాధ పడే వారు అరటి దూట జ్యూస్‌ను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
మధుమేహం ఉన్న వారికి కూడా ఈ అరటి దూట ఎంతో మేలు చేస్తుంది.అరటి దూటను డైట్‌లో చేర్చుకుంటే.
బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.ఇక అరటి దూట్‌ను తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.