సినీ ప్రేక్షకులు మారుతున్న కాలానికి అనుగుణంగా సినిమాల విషయంలో మారుతుండటం గమనార్హం.ఈ మధ్య కాలం పురాణాలు, ఇతిహాసాలకు ప్రాధాన్యత ఇస్తూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాల జాబితా అంతకంతకూ పెరుగుతోంది.
అఖండ, కార్తికేయ2, హనుమాన్, కల్కి సినిమాలను ఈ జాబితాలో చెప్పుకోవచ్చు.ఈ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి విజయం సాధించాయి.
బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ సినిమా( Akhanda ) ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అఖండ సినిమా 70 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమాకు 70 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.
నిఖిల్ చందూ మొండేటి కాంబోలో తెరకెక్కిన కార్తికేయ2 ( Karthikeya 2 )సినిమా సైతం అంచనాలను మించి మెప్పించింది.ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ ఏడాది విడుదలైన హనుమాన్ సినిమా( Hanu-Man ) సైతం అంచనాలను మించి విజయం సాధించిన సంగతి తెలిసిందే.తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది.ఇటీవల విడుదలైన కల్కి సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కల్కి సినిమా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కింది.
నాగ్ అశ్విన్ విజన్, టాలెంట్ ను ఎంత ప్రశంసించినా తక్కువేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.నాగ్ అశ్విన్ సొంత బ్యానర్ లోనే సినిమాలను తెరకెక్కిస్తూ ఉండటంతో ఆయన రెమ్యునరేషన్ గురించి క్లారిటీ రావడం లేదు.నాగ్ అశ్విన్ భవిష్యత్తు ప్రాజెక్ట్స్ గురించి త్వరలో పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ స్థాయిలో అదరగొడుతూ ఇతర భాషల ప్రేక్షకులను సైతం మెప్పిస్తున్నాయి.
టాలీవుడ్ స్టార్స్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతోమంది హీరోలకు స్పూర్తిగా నిలుస్తున్నారు.