అమెరికా అధ్యక్ష ఎన్నికలు : బైడెన్ కంటే కమలా హారిస్‌కే జనం మద్ధతు, సర్వే ఏం చెబుతోంది..?

మరికొద్దినెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల( US Presidential Elections ) నేపథ్యంలో అక్కడ రాజకీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి.ఇటీవల నిర్వహించిన ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో అధ్యక్షుడు బైడెన్( President Biden ) తడబడగా.

 Us Vice-president Kamala Harris Has A Better Chance Of Retaining White House Tha-TeluguStop.com

ఆయనపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) పైచేయి సాధించారు.దీంతో బైడెన్ తప్పుకుని డెమొక్రాటిక్ పార్టీలో మరొకరికి అవకాశం ఇవ్వాలని విపక్ష రిపబ్లికన్‌లతో పాటు సొంత పార్టీ నేతలు సైతం డిమాండ్ చేస్తున్నారు.

అయితే దీనికి బైడెన్ కౌంటరిచ్చారు.తాను యువకుడిని కాదని, చర్చా కార్యక్రమంలో తాను నిజాలు మాత్రమే మాట్లాడానని పేర్కొన్నారు.

దీనిని బట్టి ఆయన పోటీ నుంచి తప్పుకోవడం లేదని పరోక్ష సంకేతాలిచ్చారు.

Telugu Biden, Cnn, Democratic, Donald Trump, Kamala Harris, Michelle Obama, Pres

మరోవైపు.అమెరికా ఉపాధ్యక్ష పీఠం అధిష్టించిన తొలి మహిళగా, తొలి నల్లజాతి వ్యక్తిగా, తొలి ఆసియన్‌గా, తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించిన కమలా హారిస్‌కు( Kamala Harris ) ప్రజల్లో పాపులారిటీ పెరుగుతోంది.కమలా హారిస్ మరోసారి వైట్‌హౌస్‌లో అడుగుపెట్టడం ఖాయమని అంతర్జాతీయ వార్తాసంస్థ సీఎన్ఎన్( CNN ) నిర్వహించిన సర్వేలో తేలింది.

అట్లాంటాలో జరిగిన తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత బైడెన్ రేటింగ్ పాయింట్లు క్షీణించాయి.ఎస్ఆర్ఎస్ నిర్వహించిన సీఎన్ఎన్ పోల్‌లో బైడెన్ కంటే ట్రంప్ ఆరు పాయింట్ల ముందంజలో ఉన్నారు.

Telugu Biden, Cnn, Democratic, Donald Trump, Kamala Harris, Michelle Obama, Pres

అలాగే డొనాల్డ్ ట్రంప్ – కమలా హారిస్ మధ్య పాయింట్ల విషయంలో చెప్పుకోదగ్గ దూరం లేదని తేలింది.నమోదిత ఓటర్లలో 47 శాతం మంది ట్రంప్‌కు, 45 శాతం మంది హారిస్‌కు మద్ధతుగా నిలిచారు.కమలా హారిస్ ప్రదర్శన .మహిళల విస్తృత మద్ధతుపై ఆధారపడి ఉంటుంది.50 శాతం మంది మహిళలు ట్రంప్‌ కంటే కమలా హారిస్‌కే మద్ధతుగా నిలవగా.బైడెన్‌కు 44 శాతం మంది మాత్రమే జైకొట్టారు.

అయితే వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ ఈ సర్వే ఫలితాలపై స్పందించడానికి నిరాకరించారు.

ఇకపోతే ఇప్సాస్ నిర్వహించిన పోల్‌లో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిచెల్ ఒబామా.

ట్రంప్ కంటే 11 పాయింట్ల ముందంజలో ఉన్నారు.ట్రంప్‌కు 39 శాతం మద్ధతుగా నిలిస్తే.

మిచెల్‌కు 50 శాతం మంది జై కొట్టారు.అయితే మిచెల్ ఒబామా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఈ ఏడాది మార్చిలో ఎన్‌బీసీ న్యూస్‌కు ఆమె కార్యాలయం వెల్లడించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube