ఏపీ లో అధికారం దక్కించుకున్న టిడిపి, జనసేన, బిజెపి, కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, తమ చిత్త శుద్దిని చాటుకుని ప్రయత్నం చేస్తున్నాయి.ఒక్కో హామీని నెరవేరుస్తూ, ప్రజలకు శుభవార్త లు చెబుతూనే వస్తున్నారు.
ఏపీలో కొత్త ఇసుక పాలసీని( New Sand Policy ) అమలు చేయబోతున్నారు .గత వైసిపి ప్రభుత్వానికి ప్రస్తుత టిడిపి కూటమి( TDP Alliance ) ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం కనిపించే విధంగా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
దీనిలో భాగంగానే ఇసుక, రోడ్లు, నిత్యవసర వస్తువుల ధరలపై ఈరోజు చంద్రబాబు( Chandrababu ) సమీక్ష నిర్వహించారు.దీనిలో భాగంగా ఇకపై ఏపీలో ప్రజలకు ఉచితంగా ఇసుక( Free Sand ) అందించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.చంద్రబాబు నిర్ణయంతో త్వరలోనే సామాన్యులకు ఉచిత ఇసుక విధానం అందుబాటులోకి రానుంది.తక్షణమే ఇసుక అందుబాటులోకి వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు .గత వైసిపి ప్రభుత్వ హయాంలో నిర్మాణ రంగంలో సంక్షోభం ఏర్పడిందని,
ఇసుక కొరత కారణంగా ఇళ్ల నిర్మాణాలు మందగించాయని , సరైన పనులు లేక భవన నిర్మాణ కార్మికులు వలస వెళ్లారని, అప్పట్లో టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అనేక విమర్శలు చేయడంతో పాటు , అప్పట్లో వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు.ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించేందుకు చర్యలు మొదలుపెట్టారు.ఈ మేరకు జూలై 8వ తేదీ నుంచి ఏపీ వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నారు.