హెయిర్ ఫాల్( Hair Fall ) అనేది దాదాపు అందరిలోనూ ఉంటుంది.కానీ కొందరిలో మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది.
అధికంగా జుట్టు రాలడం వల్ల కురులు రోజురోజుకు పల్చగా మారిపోతూ ఉంటాయి.దీనికి డాండ్రఫ్( Dandruff ) తోడైతే ఇక వారి బాధ వర్ణనాతీతం.
జుట్టు రాలడం, చుండ్రు సమస్యలను ఎలా వదిలించుకోవాలో తెలియక తెగ సతమతం అవుతుంటారు.అయితే ఈ రెండిటికి ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ బెస్ట్ సొల్యూషన్ అవుతుంది.
ఈ ఆయిల్ ను వాడితే చాలా సులభంగా మరియు వేగంగా హెయిర్ ఫాల్ మరియు డాండ్రఫ్ సమస్యలను వదిలించుకోవచ్చు.మరి ఇంతకీ ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek Seeds ) వేసుకోవాలి.అలాగే రెండు అంగుళాల అల్లం ముక్క,( Ginger ) 10 మిరియాలు మరియు నాలుగు రెబ్బలు కరివేపాకు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాస్ ఆవనూనె మరియు గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అల్లం, మిరియాలు, మెంతుల మిశ్రమాన్ని వేసుకోవాలి.చిన్న మంటపై 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను( Oil ) ఫిల్టర్ చేసుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక ఒక బాటిల్ లో ఆయిల్ ను స్టోర్ చేసుకోవాలి.కురుల ఆరోగ్యానికి ఈ ఆయిల్ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి తయారు చేసుకున్న ఆయిల్ ను అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి.
ఆయిల్ అప్లై చేసుకున్న మరుసటి రోజు లేదా నాలుగు గంటల తర్వాత షాంపూ చేసుకోవచ్చు.ఈ ఆయిల్ ను వాడటం వల్ల హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారుతాయి.
జుట్టు రాలడం తగ్గుతుంది.
అలాగే అల్లం, మిరియాలు, మెంతులు ఇవి చుండ్రు సమస్యను సమర్థవంతంగా దూరం చేస్తాయి.
స్కాల్ప్ ను హెల్తీ గా మారుస్తాయి.అంతేకాదు ఇప్పుడు చెప్పుకున్న ఆయిల్ ను వాడటం అలవాటు చేసుకుంటే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.
కురులు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తాయి.హెయిర్ బ్రేకేజ్ సమస్య సైతం తగ్గు ముఖం పడుతుంది.