టాలీవుడ్ స్క్రీన్‌పై మెరవనున్న సంతూర్ మమ్మీ.. ఆమె ఎవరంటే..?

విశ్వక్ సేన్ ( Vishwak Sen )”గామి” సినిమాతో బాగా దెబ్బతిన్నాడు ఇప్పుడు మరొక మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు.ఆ ఫిల్మ్ నేమ్ “లైలా”.

 Santhoor Mummy In Vishwak Sen Movie , Vishwak Sen Movie, Santhoor Mummy , Akanks-TeluguStop.com

ఇందులో ఈ హీరో లేడీ గెటప్ లో కనిపించనున్నాడని చెప్పి హైప్ పెంచేశారు.బట్టల రామస్వామి బయోపిక్ ఫేమ్ రామ్ నారాయణ్ డైరెక్ట్ చేస్తున్నాడు ఈ మూవీ ఈరోజే ప్రారంభమైంది.

విశ్వక్ సేన్ లేడీ గెటప్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది.అది దుమ్ము రేపింది.

ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న నటి కంటే విశ్వక్సేనే అందంగా ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు.మరి ఆ హీరోయిన్ ఎవరా అని చూస్తే ఆకాంక్ష శర్మ ( Akanksha Sharma )అని తేలింది.

ఆమె మహేష్ బాబుతో కలిసి సంతూర్ ప్రకటనలో ఒక తల్లిలాగా నటించింది.ఆ కమర్షియల్ యాడ్ కాన్సెప్ట్‌, స్క్రిప్ట్‌కి ఆకాంక్ష శర్మ బాగా సెట్ అయింది.అందుకే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.ఎక్కువగా తల్లులే సోప్స్ కొనుగోలు చేస్తుంటారు.

వారిని ఆకట్టుకునే లాగా ఈ సంతూర్ యాడ్ రూపొందించారు.తల్లుల దృష్టిలో పడితే ప్రతి ఒక్క ఇంట్లో తమ సోపే ఉంటుందనేది ఈ కంపెనీ తెలివి.

Telugu Akanksha Sharma, Cricket, Santhoor Mummy, Santhoormummy, Tollywood, Vishw

ఈ ప్రకటనలో ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటుంది.అక్కడే మహేష్ బాబు ఆయనతో పాటు మరొకరు ఉంటారు. క్రికెట్ మ్యాచ్ ( cricket match )లో ఒక అందమైన మహిళని మహేష్ బాబు చూస్తూ ఉంటాడు.దాంతో పక్కన ఉన్న మహిళ మన సినిమాకు హీరోయిన్ దొరికేసింది అని చెబుతుంది.

అంతలోనే ఆమె వద్దకు ఒక చిన్న పిల్ల వచ్చి మమ్మీ అని హత్తుకుంటుంది.అలా ఆకాంక్ష శర్మ ఒక గృహిణిగా నటించడం, ఆమె హీరోయిన్ లాగా అందంగా కనిపించడం ఇక్కడ హైలెట్ చేశారు.

సంతూర్ సబ్బు వాడితే ప్రతి ఒక్కరు కూడా ఇలానే తయారవుతారు అన్నట్టు చెప్పుకొచ్చారు.ఆకాంక్ష శర్మ మోడలింగ్ కెరీర్ లో రాణిస్తూ ఇలాంటి కమర్షియల్ యాడ్స్ లో అవకాశాలను దక్కించుకుంటోంది.

తద్వారా అందరి ప్రేక్షకులకు దగ్గరవుతోంది.క్యాడ్బరీ డెయిరీ మిల్క్ ప్రకటనల్లో కూడా ఈ తార నటించి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.

Telugu Akanksha Sharma, Cricket, Santhoor Mummy, Santhoormummy, Tollywood, Vishw

హర్యానాకు చెందిన ఈమెలో వేరే టాలెంట్స్ కూడా ఉన్నాయి.తల్లి సాక్షి శర్మ( ఓ చాప్టర్ అకాడమీ రన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఆకాంక్ష మ్యూజిక్ వీడియోలు కూడా చేస్తుంది.అంతేకాదు కన్నడ మూవీ “త్రివిక్రమ”లో నటించి మెప్పించింది.ఆకాంక్ష చేసిన కాసనోవా, జుగ్ను, ఐయామ్ డిస్కోడాన్సర్ వీడియోలు బాగా ఫేమస్ కూడా అయ్యాయి.టైగర్ ష్రాఫ్‌తో ఆమెకు ఆ పేరు పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి కానీ వీటిని ఎవరూ కన్ఫామ్ చేయలేదు.

అయితే ఈమె ఐఐటీ ఢిల్లీలో చదువుకున్నట్లు కొన్ని కథనాలు వచ్చాయి కానీ నిజానికి ఐఐటీ ఢిల్లీ చదువుకున్న ఆకాంక్ష శర్మ వేరు, ఈమె వేరు.అంత ప్రతిష్టాత్మక సంస్థలో చదువుకుని యాక్టింగ్ ఫీల్డ్ లోకి వచ్చిందా అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు కానీ అది వాస్తవం కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube