ఇటలీలో దయనీయ స్ధితిలో భారతీయ కార్మికుడి మృతి .. రోజుల తర్వాత యజమాని అరెస్ట్

భారత్‌కు చెందిన సత్నామ్ సింగ్( Satnam Singh ) అనే ఓ కార్మికుడు ఇటలీలో( Italy ) అత్యంత దయనీయ స్ధితిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే.దీంతో ఇటలీ ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి.

 Italian Employer Arrested For Indian Farm Worker Satnam Singhs Death Details, It-TeluguStop.com

ఈ ఘటనకు సంబంధించి బాధితుడికి వైద్య సహాయం అందించకుండా రోడ్డుపై పడేసిన వ్యవసాయ కంపెనీ యజమానిని ఇటలీ పోలీసులు అరెస్ట్ చేశారు.సత్నామ్ సింగ్ మరణానికి కారణమనే అనుమానంతో గ్యాంగ్‌మాస్టర్ ఆంటోనెల్లో లోవాటోను( Antonello Lovato ) పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లుగా కథనాలు వస్తున్నాయి.

ఈ అరెస్ట్‌పై లాజియో ఇండియన్ కమ్యూనిటీ అధ్యక్షుడు గురుముఖ్ సింగ్ స్పందిస్తూ.తాము ఈ వార్త కోసం ఎదురుచూస్తున్నామన్నారు.కార్మికుడికి ప్రమాదం జరిగిన తర్వాత వైద్య సహాయం అందించకపోవడం ఆమోదయోగ్యం కాదని సింగ్ వ్యాఖ్యానించారు.అయితే సత్నామ్ సింగ్ మరణం తర్వాత ఇటలీలోని గ్యాంగ్ మాస్టరింగ్‌పై సర్వత్రా ఆగ్రహాలు వ్యక్తమయ్యాయి.

ఆధునిక బానిసత్వంగా పరిగణించే ఈ విధానం దక్షిణ ఇటలీలో విస్తృతంగా వ్యాపించింది.భర్త మరణంతో షాక్‌కు గురైన సత్నామ్ సింగ్ భార్య సోనీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం ఇటలీలో తన అక్రమ స్థితిని ముగించడానికి ప్రత్యేక అనుమతి పొందారు.

Telugu Georgia Meloni, Indian Farm, Italy, Punjab, Rome, Satnam Singh-Telugu NRI

కాగా.పంజాబ్‌కు ( Punjab )చెందిన సత్నామ్ సింగ్ (31) అనే కార్మికుడు ఇటలీలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో( Farm ) పనిచేసేందుకు అనధికారికంగా వెళ్లాడు.అక్కడి ఓ వ్యవసాయ క్షేత్రంలో పనికి కుదిరిన ఆయన.కొద్దిరోజుల క్రితం ఎండుగడ్డిని కత్తిరిస్తుండగా ప్రమాదవశాత్తూ చేయి తెగి విపరీతంగా రక్తస్రావమైంది.అయితే వ్యవసాయ క్షేత్రంలోని సిబ్బంది అతనిని ఆసుపత్రికి తరలించకుండా ఒక చెత్త బస్తాలో ఉంచి రోడ్డు పక్కన పడేశారు.బాధితుడి భార్య, సన్నిహితులు దీనిపై పోలీసులకు సమాచారం అందించారు.

దీనిపై స్పందించిన అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సత్నామ్ సింగ్‌ను హుటాహుటిన ఎయిర్ అంబులెన్స్‌లో రోమ్‌లోని( Rome ) ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ సత్నామ్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు.

Telugu Georgia Meloni, Indian Farm, Italy, Punjab, Rome, Satnam Singh-Telugu NRI

ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని కుదిపేయడంతో పాటు ఇటలీలోని ప్రమాదకర పరిస్ధితుల్లో పనిచేస్తున్న కార్మికుల క్షేమంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తమను ఇక్కడి యజమానులు కుక్కల్లా చూస్తున్నారని, తమ శ్రమను దోపిడీ చేస్తున్నారని కార్మికులు ఆరోపించారు.భారత ప్రభుత్వం సైతం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది.మరోవైపు ఇటలీ పార్లమెంట్‌ను సైతం ఈ అంశం కుదిపేసింది.కార్మికుడి మృతికి ఆ దేశ ప్రధాని జార్జియా మెలోని( Georgia Meloni ) సంతాపం ప్రకటించి, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని జార్జియా మెలోని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube