వైరల్ వీడియో: దగ్గు మందు సీసాను మింగేందుకు ప్రయతించిన పాము.. చివరకు..

సోషల్ మీడియాలో ప్రతిరోజు వందల సంఖ్యలో వీడియోలు వస్తువుంటాయి.అందులో కొన్ని మాత్రమే వైరల్ అవుతాయి.

 Viral Video Snake Tried To Swallow Cough Medicine Bottle Finally, Social Media,-TeluguStop.com

ముఖ్యంగా ఫన్ క్రియేట్ చేసే వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుండగా అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవ్వడం చూస్తూనే ఉంటాము.ముఖ్యంగా కొందరు భారతీయ ఫారెస్ట్ అధికారులు జంతువులకు సంబంధించిన అనేక వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం మన గమనిస్తూనే ఉన్నాం.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నంద ( IFS officer Sushant Nanda )సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఓ పాము దగ్గు బాటిల్ ను మింగింది.

దాంతో ఆ పాము పడిన అవస్థలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.ఒడిస్సా రాజధాని భువనేశ్వర్‌( Bhubaneswar , Odisha ) లో ఈ సంఘటన జరిగింది.రోడ్డుపై ఉన్న ఓ నిర్మానుష ప్రాంతంలో ఈ పాము సంచరించడం కొందరు వ్యక్తులు గమనించడంతో ఈ విషయం కాస్త బయటకు వచ్చింది.

ఆ సమయంలో కొంతమంది తీసిన వీడియోలు సోషల్ మీడియాలో కాస్త పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి.ఇక పాము ఓ దగ్గు మందు సీసాను మింగడంతో అది ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడుతున్న సమయం లో కొందరు ఆ విషయాన్ని జంతు సంబంధిత అధికారులకు తెలియజేయగా.

వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పామును రక్షించారు.ముందుగా పాము నోటి నుండి దగ్గు మందు సీసాను బయటకు తీయడానికి అధికారులు కాస్త ఇబ్బంది పడ్డారని చెప్పవచ్చు.ఆ తర్వాత కాస్త గట్టిగా ప్రయత్నం చేయడంతో పాము నోటి నుంచి దగ్గు సీసాను బయటకు తీసి దానిని కొంత దూరం తీసుకువెళ్లి వదిలేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube