చలికాలం, పొడిచర్మం, రెండు ఒకేసారి వస్తాయి.వెళ్ళేటప్పుడు కూడా కలిసే వెళతాయి.
చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా.పొడిబారిపోయి, అతిగా పౌడర్ రాసేసుకున్నట్టుగా ఉండే చర్మం, ఒక్కోసారి దురదగా కూడా అనిపిస్తూ ఉంటుంది.ఈ పొడిచర్మంతో ఇబ్బందిపడేకన్నా .మేం చెప్పే సూచనలపై కొంచెం కష్టపడండి
* కొబ్బరినూనెలో ఫాట్టి ఆసిడ్స్ ఎక్కువ ఉంటాయి.రాత్రి పడుకునే ముందు చర్మానికి కొబ్బరినూనె పట్టి, ఉదయం లేవగానే కదిగేసుకోండి.పొడిబారిన చర్మం కోమలంగా మారుతుంది
* యొగ్ రట్ లో మాయిశ్చరైజర్ ఎలిమెంట్స్ బాగా ఉంటాయి.
స్నానానికి ఓ పది నిమిషాల ముందు దీన్ని ఒంటికి రాసుకొని స్నానం చేయండి
* పాలలో ఉండే లాక్టిక్ ఆసిడ్ మృతకాణాలపై పనిచేస్తుంది.ఇందులో యాంటి ఇంఫ్లేమెంటరి ప్రాపర్టిస్ కూడా ఎక్కువే.
కాబట్టి గుడ్డ లేదా కాటన్ ని చలిపాలలో ముంచి, చర్మంపై మెల్లిగా రుద్దండి.ఓ పది పదిహేను నిమిషాలు ఉంచి ఆ తరువాత కడిగేసుకోండి.
రోజూ ఇలానే చేయండి
* ఆలీవ్ ఆయిల్ లో ఫాట్టి ఆసిడ్స్ తో పాటు యాంటిఆక్సిడెంట్స్ లభిస్తాయి.అందుకే ఇది చర్మ ఆరోగ్యానికి మందు లాంటిది.
స్నానానికి ఓ అరగంట ముందు చర్మానికి ఆలివ్ ఆయిల్ పట్టి ఆ తరువాత స్నానం చేయండి
* రోజు స్నానానికి పదిహేను నిమిషాల ముందు చర్మానికి తేనే రాసుకోండి.ఇది కేవలం పొడిచర్మం కోసమే కాదు, చర్మాన్ని కాంతివంతంగా, నునుపుగా చేయడానికి ఉపయోగపడుతుంది.
అయితే, సాద్యమైనంతవరకు ఆర్గానిక్ తేనే వాడటానికి ప్రయత్నించండి
.