దోమల బెడద బాగా పెరిగిపోయిందా.. అయితే వాటికి ఇలా చెక్ పెట్టండి!

వర్షాకాలం వచ్చిందంటే చాలు దోమల బెడద విపరీతంగా పెరిగిపోతుంది.ఎక్కడికక్కడ నీటి నిల్వలు కారణంగా దోమలు( Mosquitoes ) వృద్ధి చాలా అధికంగా ఉంటుంది.

 If You Follow These Tips Mosquitoes Will Not Enter The House Details, Mosquitoe-TeluguStop.com

పైగా వర్షాకాలంలో( Monsoon ) దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ.అందుకే దోమల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

దోమలు మన దరిదాపుల్లోకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలు చాలా అద్భుతంగా తోడ్పడతాయి.

ఇంట్లోకి దోమలు రాకుండా అడ్డుకోవడంలో కర్పూరం బాగా సహాయపడుతుంది.ఒక వెడల్పాటి గిన్నెలో వాటర్ తీసుకుని అందులో కొన్ని కర్పూరం( Camphor ) బిళ్ళలు వేసి ఇంట్లో ఉంచాలి.

ఇలా చేయడం వల్ల ఆ స్మెల్ కు దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

Telugu Camphor, Coconut Oil, Garlic, Tips, Mint, Monsoon, Mosquito, Mosquitoes,

అలాగే పుదీనా తో( Mint ) కూడా దోమలకు చెక్ పెట్టవచ్చు.పుదీనా వాసన దోమలకు అస్సలు పడదు.కాబట్టి రూమ్ లో లేదా హాల్ లో పుదీనా మొక్కను ఉంచాలి.

ఒంటికి దోమలు కుట్టకుండా ఉండాలి అంటే ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె( Coconut Oil ) వేసుకోవాలి.మ‌రియు నాలుగు చుక్కలు మింట్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ ఆయిల్ ను చేతులకు, కాళ్ళకు, పాదాలకు అప్లై చేసుకుని పడుకోవాలి.ఇలా చేస్తే దోమలు మీ దరిదాపుల్లోకి కూడా రావు.

Telugu Camphor, Coconut Oil, Garlic, Tips, Mint, Monsoon, Mosquito, Mosquitoes,

వెల్లుల్లి( Garlic ) కూడా దోమలను అడ్డుకోగలదు.ఒక బౌల్ లో ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వాటర్ పోసి గంట పాటు నానబెట్టాలి.ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలను మెత్తగా గ్రైండ్ చేసి రసాన్ని వేరు చేయాలి.ఇప్పుడు ఈ రసాన్ని ఒక స్ప్రే బాటిల్ లో నింపి ఇంట్లో స్ప్రే చేయాలి.

వెల్లుల్లి లో ఉండే సల్ఫర్ దోమలనే కాదు ఈగలు, కీటకాలు సైతం ఇంట్లోకి రాకుండా చేస్తుంది.ఇక నైట్ పడుకునే ముందు బెడ్ కు నాలుగు వైపులా నాలుగు చుక్కలు లవంగం తైలాన్ని వేయాలి.

ఇలా చేయడం వల్ల దోమలు రూమ్ లో నుంచి పరారవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube