గత కొద్ది రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాగే ఏపీ రాజకీయాలలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు పవన్ కళ్యాణ్.( Pawan Kalyan ) ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ 21 స్థానాలలో పోటీ చేయగా 21 స్థానాలు గెలిచి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
దీంతో ఎన్నికల ఫలితాలు విడుదల అయినప్పటి నుంచి ప్రతి రోజు పవన్ కళ్యాణ్ పేరు సోషల్ మీడియాలో అలాగే ఏపీ రాజకీయాలలో మారుమోగుతూనే ఉంది.ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఒకవైపు వారాహి దీక్షను( Varahi Deeksha ) కొనసాగిస్తూనే మరొకవైపు డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలను నిర్వహిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు పవన్ కళ్యాణ్. ఈ ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు.తాజాగా బుధవారం రోజు స్థలం కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు పవన్.పిఠాపురం( Pithapuram ) మండలం లోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో ఉన్న 1.44 ఎకరాలు, 2.08 ఎకరాలు రెండు బిట్లు తీసుకున్నారు.బుధవారం మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల మధ్యలో పవన్ కల్యాణ్ పేరున రిజిస్ట్రేషన్ పూర్తయింది.
ఇందులో రెండు ఎకరాల స్థలంలో క్యాంపు ఆఫీసు, ( Camp Office ) మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకుని, పిఠాపురం వాస్తవ్యుడిగా ఉంటానని బహిరంగసభలో ప్రజలకు తెలిపారు.ఈ ప్రాంతంలో ఎకరం మార్కెట్ విలువ రూ.15-16 లక్షల మేర ఉంది.మరో పదెకరాల తోటలు జనసేన నేతలు కొనేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఈ ప్రకారంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన ఆ మొత్తం స్థలం విలువ దాదాపు 45 లక్షల వరకు ఉండవచ్చని అంచనా.