టాలీవుడ్ హీరో ప్రభాస్( Prabhas ) నటించిన తాజా చిత్రం కల్కి.( Kalki ) తాజాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన విషయం తెలిసిందే.ప్రస్తుతం కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.ఇప్పటివరకు దాదాపు 700 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ సినిమా అనేక చోట్ల రికార్డులను బద్దలు కొడుతూ మరిన్ని కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతోంది.
ఇకపోతే తాజాగా కల్కి సినిమాతో హైదరాబాద్ లోని మూడు మల్టీప్లెక్స్ థియేటర్స్ సరికొత్త రికార్డ్ సెట్ చేసాయి.హైదరాబాద్ గచ్చిబౌలిలో మహేష్ బాబుకు( Mahesh Babu ) చెందిన AMB సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్ ఉన్న సంగతి తెలిసిందే.
ఇక్కడ 7 స్క్రీన్స్ ఉన్నాయి.రిలీజ్ రోజు అన్ని స్క్రీన్స్ లో కలిపి ఆల్మోస్ట్ 40 షోల వరకు వేసినట్టు తెలుస్తోంది .అన్ని షోలు వేసిన కూడా థియేటర్ బయట హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయట.అంతే కాకుండా AMBలో ఒక కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్స్ ఫాస్ట్ గా సాధించిన సినిమాగా కల్కి నిలిచి సరికొత్త రికార్డును సృష్టించింది.
అయితే మహేష్ థియేటర్లో మహేష్ సినిమా కూడా ఇంత ఫాస్ట్ గా కోటి గ్రాస్ కలెక్ట్ చేయలేదు.దీంతో మహేష్ ఇలాకాలో ప్రభాస్ సరికొత్త రికార్డ్ అని అంటున్నారు అభిమానులు.
AMB సినిమాస్ స్వయంగా ఈ రికార్డ్ ని పోస్ట్ చేయడం గమనార్హం.
అలాగే హైదరాబాద్( Hyderabad ) నల్లగండ్లలో ఇటీవలే అపర్ణ సినిమాస్ అనే మల్టీప్లెక్స్ థియేటర్ ప్రారంభించారు.ఇక్కడ కూడా కల్కి రిలీజ్ రోజు మొత్తం 42 షోలు వేశారు.అన్ని షోలు హౌస్ ఫుల్ అయ్యాయి.
ఇక్కడ ఫస్ట్ టైం కోటి రూపాయల గ్రాస్ సాధించిన సినిమాగా కల్కి నిలిచింది.అయిదు రోజుల్లో కోటి పది లక్షలు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది కల్కి సినిమా.
ఇక ఈ సినిమా ఇలా ప్రతి ఒక్క చోట రికార్డుల రికార్డులు సృష్టిస్తున్నడంతో మూవీ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.