మెగాస్టార్ చిరంజీవికి( Megastar Chiranjeevi ) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉండటంతో చిరంజీవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.
చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి లారెన్స్ కాంబినేషన్ రిపీట్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.చిరంజీవి విశ్వంభర ( Viswambara )సినిమాకు లారెన్స్ కొరియోగ్రాఫర్ పని చేస్తారని సమాచారం అందుతోంది.
లారెన్స్ ప్రస్తుతం నటుడిగా, దర్శకుడిగా బిజీగా ఉన్నారు.అయితే చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి అడగడంతో లారెన్స్ కొరియోగ్రాఫర్ గా పని చేయడానికి ఆసక్తి చూపించారని తెలుస్తోంది.
చిరంజీవి లారెన్స్( Lawrence ) కాంబినేషన్ సినిమాలన్నీ హిట్ సినిమాలు కావడంతో ఈ సినిమా కూడా హిట్ గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
చిరంజీవి మల్లిడి వశిష్ట ( Mallidi Vasishta )కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఈ సినిమాను నిర్మిస్తుండగా ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 200 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది.చిరంజీవి రెమ్యునరేషన్ మాత్రం 50 నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.
చిరంజీవి భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సైతం బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.చిరంజీవి, త్రిష కాంబినేషన్ ఈ సినిమాతో రిపీట్ కానున్న సంగతి తెలిసిందే.మెగాస్టార్ తర్వాత ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఆ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేస్తాయేమో చూడాల్సి ఉంది.