తొందరొద్దు ... వైసిపి కార్యాలయంలో కూల్చివేత పై హైకోర్టు 

వైసిపికి ఊరట లభించే విధంగా హైకోర్టు తీర్పును వెలువరించింది.టిడిపి, జనసేన,, బిజెపి, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొదటగా వైసీపీ కార్యాలయాల( YCP Offices ) కూల్చివేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

 Ap High Court Big Relief For Ycp Party Details, Ysrcp, Ap Government, Jagan, Tdp-TeluguStop.com

సరైన అనుమతులు లేకుండా,  నిబంధనలు ఉల్లంఘించి వైసిపి కార్యాలయాలు నిర్మించారని ఆరోపిస్తూ అనేకచోట్ల వైసిపి కార్యాలయాల కూల్చివేత మొదలుపెట్టారు.దీనిపై వైసీపీ కోర్టులో సవాల్ చేయగా దీనిపై స్టే ఇచ్చింది.

తాజాగా మరోసారి స్టేటస్ కో కొనసాగిస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.వైసిపి ఇచ్చే వివరణను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోర్టు సూచించింది.

Telugu Ap, Cm Chandrababu, Jagan, Janasena, Mangalagiri, Status Quo, Ycp, Ysrcp-

అధికారులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని,  ప్రజా ప్రయోజనాలకు విగాతం కలిగితే తప్ప,  ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు వ్యాఖ్యానించింది.  భవనాలకు అనుమతులకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని రెండు వారాల్లో సమర్పించాలని వైసీపీ తరఫున పిటిషనర్లకు సూచించింది.సంబంధిత అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హైకోర్టు( High Court ) నిబంధనలు పాటించాలని సూచించింది.  ఏపీవ్యాప్తంగా పదికి పైగా వైసీపీ ఆఫీసులకు ఇప్పటివరకు నోటీసులు అందజేసింది ఏపీ ప్రభుత్వం.

దీంతోనే కోర్టును ఆశ్రయించారు వైసీపీ నేతలు.  గత టిడిపి ప్రభుత్వంలో నిబంధనల ప్రకారం భూ కేటాయింపులు జరిగాయని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. 

Telugu Ap, Cm Chandrababu, Jagan, Janasena, Mangalagiri, Status Quo, Ycp, Ysrcp-

అనుమతుల విషయంలో పొరపాట్లు లేవని వైసీపీ తరఫున న్యాయవాదులు వాదించారు.దీంతో ప్రస్తుతం ఇచ్చిన స్టేటస్ కో( Status Quo ) ను కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది.టిడిపి కూటమి అధికారంలోకి రాగానే మొదటగా మంగళగిరిలోని( Mangalagiri ) వైసిపి కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేశారు సీఆర్డీఏ అధికారులు .అప్పట్లో కోర్టును ఆశ్రయించినప్పటికీ హైకోర్టు తీర్పు వచ్చే క్రమంలోనే పార్టీ ఆఫీసులను పడగొట్టారు.అలాగే విశాఖపట్నం,  అనకాపల్లి లోను అనేక ప్రాంతాల్లో వైసిపి కార్యాలయాలకు నోటీసులు అందించారు .దీనిపైనే పిటిషన్  దాఖలు కాగా కోర్టు ఈ విధంగా స్టేటస్కో కొనసాగిస్తూ తీర్పు చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube