ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ డాన్సర్ ఎవరు అంటే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ చిరంజీవి( Chiranjeevi ) గారి పేరే చెబుతూ ఉంటాము.ఎందుకంటే ఇప్పటివరకు చిరంజీవిని డాన్స్ లో( Chiranjeevi Dance ) బీట్ చేసే హీరో తెలుగులో మరొకరు లేరు అనేది వాస్తవం.
ఇప్పుడున్న హీరో లు ఎంత మంది ఎన్ని బ్రేక్ డాన్స్ లు, జిమ్నాస్టిక్స్ స్టెప్పులు వేసినా కూడా చిరంజీవి గ్రేస్ ని అందుకోవడం మాత్రం ఎవ్వరి వల్ల కాదు.ఒక పాట మీద చిరంజీవి స్టెప్పులు చూసిన తర్వాత ఆయన ప్లేస్ లో మరొక హీరోని ఊహించుకోవడం కూడా చాలా కష్టమనే చెప్పాలి.
అలాంటి చిరంజీవి డ్యాన్స్ వెనకాల చాలామంది కొరియోగ్రాఫర్ల కృషి ఉంది.అందులో ముఖ్యంగా ప్రభుదేవా, లారెన్స్ మాస్టర్లు మాత్రం చాలా కీలకపాత్ర వహించారనే చెప్పాలి.ఇక లారెన్స్ మాస్టర్( Lawrence Master ) కొరియోగ్రఫీ చేసిన ఇంద్ర సినిమాలోని దాయి దాయి దమ్మ అనే సాంగ్ ఇప్పటికీ ఫేమస్ అనే చెప్పాలి.మరి ఇలాంటి క్రమంలో ప్రస్తుతం ఆయన విశ్వంభర( Vishwambhara ) అనే సినిమా కోసం మరోసారి ప్రభు, లారెన్స్ మాస్టర్ లతో కొరియోగ్రఫీ చేయించుకున్నట్టుగా తెలుస్తుంది.
ఇక గత చిత్రాల్లో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లాంటి కొరియోగ్రాఫర్లతో కొరియోగ్రాఫీ చేయించుకున్న చిరంజీవి మళ్ళీ ఎట్టకేలకు తన ఆస్థాన కొరియోగ్రాఫర్లు అయిన ప్రభుదేవా,( Prabhudeva ) లారెన్స్ మాస్టర్ల వైపే మొగ్గు చూపిస్తున్నాడు.
ఇక అందులో భాగంగా విశ్వంభర సినిమాలో ఉన్న రెండు పాటల కోసం వీళ్ళిద్దరూ కొరియోగ్రఫీ చేయబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక తొందర్లోనే ఈ సాంగ్స్ షూట్ చేయబోతున్నాడు కూడా తెలుస్తుంది… ఇక మొత్తానికైతే చిరంజీవి ఈ సినిమాతో భారీ సక్సెస్ ని తన ఖాతా లో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… చూడాలి మరి ఈ సినిమా చిరంజీవికి తను అనుకున్న విజయాన్ని అందిస్తుందా లేదా అనేది…
.