విక్రమ్( Vikram ) హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో వస్తున్న తంగలన్( Thangalaan ) అనే సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి.అయితే ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ రెడీ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ని సినిమా యూనిట్ అయితే బయటికి తెలియజేస్తున్నారు.
ఇక ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయిన జీవి ప్రకాష్ కుమార్( GV Prakash Kumar ) ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా ట్రైలర్ ని కనుక చూసినట్లయితే అద్భుతంగా ఉంది.

ఇక సినిమా మాత్రం ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తుందని చెప్పాడు.ఇక దీంతో ఆయన మాటలతో ఒక్కసారిగా సినిమా మీద అంచనాలైతే భారీగా పెరిగిపోయాయి.మరి ఆగస్టు 15వ తేదీన రామ్ హీరోగా డబుల్ ఇస్మార్ట్( Double Ismart ) అనే సినిమా వస్తుంది.
మరి ఈ సినిమా కూడా ప్రేక్షకుల అంచనాల మేరకు అలరిస్తుందని చాలామంది భావిస్తున్నారు.మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ రెండు సినిమాల మధ్య కూడా బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ముఖ్యంగా విక్రమ్ తంగలన్ సినిమాని చూడడానికి చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఎందుకంటే ఆయన గెటప్ తోనే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెంచేశాడు.ఇక ఈ సినిమాతో విక్రమ్ కి తప్పకుండా ఆస్కార్ అవార్డు( Oscar Award ) వస్తుందంటూ మరి కొంతమంది కామెంట్లైతే చేస్తున్నారు.ఇక ఈ సినిమా రిలీజ్ అయి సినిమా ఎలా ఉంది.

విక్రమ్ పర్ఫామెన్స్ ఎలా ఉంది అనేది తెలిస్తే గాని ఈ విషయం మీద మనకు సరైన క్లారిటీ అయితే రాదు… ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విక్రమ్ కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాగా నిలువబోతుందట…ఇక అపరిచితుడు తో ఆయనకి ఎలాంటి పేరైతే వచ్చిందో ఈ సినిమాతో కూడా అలాంటి పేరు రాబోతుందని చాలా మంది వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
.