యూకేలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మొదలైంది.ప్రధాని రిషి సునాక్( PM Rishi Sunak ) సారథ్యంలో కన్జర్వేటివ్ పార్టీ( Conservative Party ) ఎన్నికలను ఎదుర్కోనుంది.
ఈసారి కూడా పెద్ద సంఖ్యలో భారత సంతతి అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.ఇవాళ జరిగే సార్వత్రిక ఎన్నికలు దేశ చరిత్రలోనే అత్యంత వైవిధ్యమైన పార్లమెంట్‌ను అందిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇందులో భారత మూలాలున్న పార్లమెంటేరియన్‌ల సంఖ్య పెరిగే అవకాశం వుందని వారు అంటున్నారు.
బ్రిటీష్ ఫ్యూచర్ థింక్ ట్యాంక్ విశ్లేషణ ప్రకారం.లేబర్ పార్టీ( Labour Party ) మెజారిటీ సీట్లను గెలవడంతో పాటు అత్యధిక సంఖ్యలో ఎథ్నిక్ మైనారిటీ ఎంపీలను కైవసం చేసుకుంటుందని తేలింది.దాదాపు 14 శాతం మంది ఎంపీలు ఎథ్నిక్ మైనారిటీ నేపథ్యం నుంచి వస్తారని పేర్కొంది.2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన 15 మంది ఎంపీలు గెలిచారు.కన్జర్వేటివ్ పార్టీకి చెందిన అలోక్ శర్మ (రీడింగ్ వెస్ట్) , లేబర్ పార్టీ సీనియర్ నేత వీరేంద్ర శర్మలు (ఈలింగ్ సౌతాల్) తాము ఈసారి పోటీ చేయడం లేదని ఇప్పటికే ప్రకటించారు.
భారత సంతతి నేతలు పోటీ చేస్తున్న స్థానాలు :
రిషి సునాక్ – రిచ్‌మండ్, నార్త్‌ల్టెర్టన్ ప్రీతి పటేల్ – ఎసెక్స్సుయెల్లా బ్రేవర్‌మాన్( Suella Braverman ) – ఫేర్‌హామ్, వాటర్ లూవిల్జస్ అథ్వాల్ – ఐఫర్డ్ సౌత్బాగీ శంకర్ – డెర్బీ సౌత్సత్వీర్ కౌర్ – సౌతాంప్టన్ టెస్ట్ హర్ ప్రీత్ ఉప్పల్ – హడర్స్ ఫీల్డ్రాజేష్ అగర్వాల్( Rajesh Agarwal ) – లీసెస్టర్ ఈస్ట్శివానీ రాజా – లీసెస్టర్ ఈస్ట్కీత్ వాస్ – లీసెస్టర్ ఈస్ట్సవారిందర్ జస్ – వోల్వర్హాంప్టన్గురీందర్ సింగ్ జోసన్ – స్మెత్విక్కనిష్క నారాయణ్( Kanishka Narayan ) – వేల్ ఆఫ్ గ్లామోర్గాన్సోనియా కుమార్ – డూడ్లేచంద్ర కన్నెగంటి( Chandra Kanneganti ) – స్టోక్ ఆన్ ట్రెంట్ సెంట్రల్అమీత్ జోగియా – హెండన్శైలేష్ వారా – నార్త్ వెస్ట్ కేంబ్రిడ్జ్షైర్గగన్ మొహింద్రా – సౌత్ వెస్ట్ హెర్ట్‌ఫోర్డ్ షైర్కైర్ కౌటిన్హో – ఈస్ట్ సర్రే
.