సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం రాజకీయాలలో కూడా ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇక రాజకీయాలలో ఈయన ఉన్నత స్థానంలో ఉండటం పట్ల ఎంతోమంది సినీ ప్రముఖులు ఈయన విజయం గురించి మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ప్రముఖ రచయితగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న రచయిత పరుచూరి గోపాలకృష్ణ(Paruchuri Gopala Krishna) పవన్ కళ్యాణ్ రాజకీయ విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ .ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో( AP Elections ) పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా వ్యవహరించారని తెలిపారు.ఎంతో అనుభవం ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడిగా ఎత్తుగడలు వేసారని తెలిపారు.
నేను పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిని కానీ ఇప్పటివరకు నాకు ఆయన సినిమాకు కథ రాసి అవకాశం మాత్రం రాలేదని తెలిపారు.ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రసంగాలు చేసినప్పుడు మాట్లాడే వ్యాఖ్యలు సినిమా డైలాగులు కాదని నిజమని నిరూపించారు.

ఈయన ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న మానసిక బలంతో ముందడుగు వేశారని తెలిపారు.ఇక ఉప ముఖ్యమంత్రిగా ఈయన బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా సహనంతో ఓపికతో తన ప్రణాళికలను రక్షిస్తున్నారని రాజకీయ నాయకుడికి ఇది చాలా అవసరమని పరుచూరి తెలిపారు.ఇక పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో నేను కల్లార్పకుండా చూశానని తెలిపారు.మా ముందు పెరిగిన ఈ కుర్రాడు ఈ స్థాయికి ఎదగడం చూసి సంతోషం అనిపించిందని తెలిపారు.
పవన్ కళ్యాణ్ సినీ జీవితంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇప్పుడు రాజకీయ జీవితంలో కూడా ఈయన చరిత్ర సృష్టించారు అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ రాజకీయ విజయం పట్ల పరుచూరి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.