టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు విశ్వక్ సేన్( Vishwak Sen ) ఒకరు.ఈయన హీరోగా ఎన్నో విభిన్న సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన విశ్వక్ తాజాగా లేడీ గెటప్( Lady Getup ) లో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఇప్పటివరకు ఎన్నో విభిన్న కథ చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన త్వరలోనే లైలా( Laila ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
రామ్ నాయక్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం నేడు ఎంతో ఘనంగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలు అనంతరం సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్లు విడుదల చేశారు.ఈ క్రమంలోనే విశ్వక్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.అయితే ఈ పోస్టర్ లో లేడీ గెటప్ లో కనిపించి విశ్వక్ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
ఈ పోస్టర్ లో ఉన్నది విశ్వక్ అని చెప్పే వరకు కూడా అక్కడ ఉన్నది అమ్మాయి కాదు అనే విషయం ఎవరికీ తెలియదు.
ఇక తాజాగా ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సినిమాపై కూడా భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి.ఇక నేడు ఎంతో ఘనంగా పూజా కార్యక్రమాలను ప్రారంభించిన ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇక ఈ సినిమాని 2025 ఫిబ్రవరి 14వ తేదీ వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఈ సందర్భంగా నిర్మాతలు వెల్లడించారు.
ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.