సొంతూరు కోసం మంచి మనస్సు చాటుకున్న చంద్రబోస్.. చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రముఖ సినీ రచయిత సుభాష్ చంద్రబోస్( Writer Subhash Chandrabose ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తెలుగులో ఎన్నో మంచి మంచి పాటలు రాసి రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు చంద్రబోస్.

 Writer Chandrabose Build Library His Village Details, Chandra Bose, Library, Vil-TeluguStop.com

ముఖ్యంగా ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాకు గాను ఆస్కార్ అవార్డును( Oscar Award ) కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఆయన చేసిన గొప్ప మనసుకి ఫిదా అవుతున్నారు అభిమానులు.

ఇంతకీ ఆయన ఏం చేశారు అన్న విషయానికి వస్తే.సినీ రచయిత కనుకుంట్ల సుభాష్‌ చంద్రబోస్‌ తన సొంతూరు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా( Jayashankar Bhupalpally ) చిట్యాల మండలం చల్లగరిగె లో ఆస్కార్‌ గ్రంథాలయం( Oscar Library ) నిర్మించారు.

Telugu Challagariga, Chandra Bose, Library, Oscar Library, Tollywood, Writersubh

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో చంద్రబోస్‌ రాసిన నాటు నాటు పాటకు( Naatu Naatu Song ) ఆస్కార్‌ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.అయితే ఆ సమయంలో తన గ్రామ ప్రజలు ఆయనకు సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఆ సందర్భంగా చల్లగరిగెలో( Challagariga ) తనకు దక్కిన గౌరవానికి గుర్తుగా ఆస్కార్‌ గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని చంద్రబోస్ మాట ఇచ్చారు.గ్రామంలో ఇది వరకే ఉన్న పాత గ్రంథాలయాన్ని తొలగించి దాదాపుగా రూ.36 లక్షలతో కొత్త భవనాన్ని ఆయన నిర్మించారు.నేడు అనగా జూలై 4వ తేదీన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, చంద్రబోస్‌ చేతుల మీదుగా ఆ గ్రంథాలయాన్ని ప్రారంభించనున్నారు.

Telugu Challagariga, Chandra Bose, Library, Oscar Library, Tollywood, Writersubh

రెండంతస్తులతో అన్ని వసతులతో దానిని ఆయన నిర్మించారు.పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న గ్రామంలోని యువకులకు అవసరమయ్యే అన్నీ పుస్తకాలను అక్కడ ఏర్పాటు చేయనున్నారు.దీంతో ఆయన చేసిన పనికి నెటిజెన్స్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లుచేస్తున్నారు.ఇకపోతే ఆయన కెరియర్ విషయానికి.సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా 30 ఏళ్ల కెరీర్‌ లో సినీ పాటల రచయితగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు చంద్రబోస్‌. ఇప్పటివరకు దాదాపుగా 860 సినిమాల్లో 3600కి పైగా పాటలు రాసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

మొదట ఒక సామాన్యుడిగా ప్రయాణం మొదలుపెట్టిన చంద్రబోస్‌ అసామాన్యంగా చిత్రసీమలో ఎదిగారు.రాబోవు తరాల కవులకి ఆయన జీవితం, ప్రయాణం ఆదర్శవంతం అనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube