సినిమా ఇండస్ట్రీ లో బ్యాగ్రౌండ్ ఉంటే పని జరిగిపోతుంది.ఎంత పెద్ద సినిమా అయినా సరే వారి కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది.
ప్రొడ్యూసర్స్ బ్యాక్ గ్రౌండ్ ఉండి పిల్లలు తమ వారసులుగా ఉంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు.వారు చెప్పిందే నడుస్తుంది ఎంత మంచి కథ ఎక్కడ నడిచినా సరే వారి పిల్లలకు ఇప్పించుకోగలరు.
ఆ సినిమాతో హిట్టు కొట్టగలరు.అలా చాలా సందర్భాల్లో పక్క హీరోల సినిమాలు లాక్కున్నవారు ఉన్నారు.
కేవలం కథ బాగుంది అనే కారణంతో తమ పిల్లలకి ఆ సినిమాని ఇప్పించుకున్నారు.మరి అలా పక్క హీరోల సినిమాలను లాక్ ఉన్న హీరోలు ఎవరు? ఎవరి వల్ల ఆ సినిమా సదరు హీరో చేజారిపోయింది అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
100% లవ్
( 100% love )
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 100% లవ్ సినిమా హీరో నాగచైతన్య మరియు తమన్నా కాంబినేషన్లో తెరకెక్కి అద్భుతమైన విజయాన్ని ఈ ఇద్దరికీ ఇచ్చింది.అయితే ఈ సినిమా మొదటగా వరుణ్ సందేశ్( Varun Sandesh ) తో తెరకెక్కించాలని సుకుమార్ అనుకున్నారు.
కానీ కథ విన్న నాగార్జున ఈ సినిమాని నాగచైతన్య తో చేయించేలా ప్రణాళికలు చేసి మరి హిట్టు కొట్టారు.

ఢీ
( Dhee )
మంచు విష్ణు హీరోగా వచ్చిన సినిమా ఢీ.ఈ సినిమాకి ముందు మరియు ఈ సినిమా తర్వాత మంచు విష్ణు కెరియర్ లో ఒక్క హిట్టు కూడా లేదు.అయితే ఈ సినిమా కథ మొదట రవితేజకు( Ravi Teja ) చెప్పడంతో ఆయన ఓకే అన్నారు కానీ మంచు మోహన్ బాబు కథ విన్న తర్వాత చాలా బాగా నచ్చడంతో రవితేజను ఒప్పించి మరి విష్ణు కు ఈ సినిమాను ఇప్పించారు.
ఇలా అయినా మంచు విష్ణు కెరియర్ లో ఒక్క విజయం ఉంది.

చంటి
( Chanti )
వెంకటేష్ మీనా కాంబినేషన్లో వచ్చిన చంటి సినిమా ఎన్నో ఏళ్ల పాటు సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది అయితే ఈ సినిమాని మొదట రాజేంద్రప్రసాద్( Rajendra Prasad ) తో తీయాలని దర్శకుడు సర్వం సిద్ధం చేసుకున్నాడు.కానీ రామానాయుడు తను పలుకుబడి ఉపయోగించి ఈ చిత్రాన్ని వెంకటేష్ చేత చేయించాడు.

ఘర్షణ
( Gharshana )
వెంకటేష్ అసలు కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా మంచి సూపర్ హిట్ చిత్రం గా నిలిచింది.అయితే ఈ సినిమాని మొదట ప్రభాస్( Prabhas ) తో చేయాలని అనుకున్నప్పటికీ ప్రభాస్ కన్నా వెంకటేష్ కి బ్యాగ్రౌండ్ ఎక్కువగా ఉండడం ఆ టైంకి ఆయన చిన్న హీరోగా ఉండటంతో ఘర్షణ సినిమా వెంకటేష్ తో చేయాల్సి వచ్చింది.







