స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఏకంగా ఆరు సినిమాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే.
ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా వరుసగా పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తుండటం గమనార్హం.అయితే ప్రభాస్ వ్యక్తిగత జీవితం గురించి ప్రభాస్ అలవాట్ల గురించి చాలామంది అభిమానులకు కచ్చితంగా తెలియదు.
ప్రభాస్ మరీ అత్యవసరం అయితే తప్ప ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా ఆసక్తి చూపించరనే సంగతి తెలిసిందే.అయితే ప్రభాస్ మద్యం సేవిస్తాడా అని మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను( Meta AI ) ప్రశ్నించగా మెటా షాకింగ్ సమాధానాన్ని వెల్లడించడం గమనార్హం.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రభాస్ గతంలో మద్యం తాగేవారని మెటా ఏఐ వెల్లడించింది.
ప్రస్తుతం ప్రభాస్ మద్యం( Alcohol ) సేవిస్తున్నాడో లేదో అనే విషయంలో స్పష్టత లేదని మెటా ఏఐ పేర్కొంది.తండ్రి మరణం తర్వాత ప్రభాస్ మద్యానికి బానిస అయినట్టు ఒక సందర్భంలో 2010లో చెప్పారని మెటా ఏఐ వెల్లడించింది.ప్రభాస్ కు కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నాయనే పుకార్లు సైతం ఉన్నాయని మెటా ఏఐ పేర్కొంది.
ప్రస్తుతం ప్రభాస్ హెల్తీ లైఫ్ స్టైల్ అవలింబిస్తున్నాడని మెటా ఏఐ తెలిపింది.
ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ( Kalki 2898 AD ) బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు.కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లను సాధిస్తోంది.ఈరోజు కలెక్షన్లతో ఈ సినిమా సలార్ కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేసినట్టు సమాచారం అందుతోంది.
ప్రభాస్ సినిమాలు అంటే ఇతర భాషల ప్రేక్షకులు సైతం థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.స్టార్ హీరో ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.