తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన ఎప్పుడు ఏ సినిమా చేసిన కూడా ఆ సినిమా కలెక్షన్ల సునామిని క్రియేట్ చేస్తుందని చెప్పడానికి ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఈయన చేసిన సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అందుకోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాము.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేయబోతున్న సినిమాల మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు.
ఇక తను ఖాళీ సమయాల్లో మాత్రమే సినిమాలు చేస్తానని మిగతా సమయం అంతా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల సేవ కొరకే వినియోగించబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాల పరిస్థితి ఏంటి అని చాలామంది సినీ మేధావులు సైతం పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఆ సినిమాల ప్రొడ్యూసర్లు విపరీతంగా డబ్బులను తీసుకొచ్చి పెట్టారు.మరి వాటికి వడ్డీలు విపరీతంగా పెరుగుతున్నాయి.
సినిమా లేటైతే వచ్చిన లాభాలు మొత్తం వడ్డిలకే పోతాయి.కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందులను గుర్తించి వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితి కి ఒక సొల్యూషన్ ఇస్తే బాగుంటుంది.
ఆయన బిజి గా ఉన్న కూడా కనీసం సెట్స్ మీద ఉన్న సినిమాలను అయిన ముందుగా పూర్తిచేసి ఆ తర్వాత సంవత్సరానికి ఒక సినిమానా లేదంటే రెండు సంవత్సరాలకు ఒక సినిమానా ఏదో ఒకటి క్లారిటీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుందంటూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారనే క్లారిటీ ఉంది.కానీ ఆయన సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయనే దానిమీదనే సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది.ఇక ఈ సంవత్సరం అయితే ఆయన సినిమాలు ఒకటి కూడా వచ్చే అవకాశాలు లేనట్టుగా తెలుస్తుంది.
మరి వచ్చే సంవత్సరం అయిన సెట్స్ మీద ఉన్న మూడు సినిమాలు కంప్లీట్ చేసి ఒకేసారి మూడు సినిమాలను రిలీజ్ చేస్తారా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…
.