రూ.10 విషయంలో ఆటోడ్రైవర్‌ను చితకబాదిన ట్రాన్స్‌జెండర్ ఉమెన్.. వీడియో వైరల్..

ట్రాన్స్‌జెండర్ల( Transgenders ) కారణంగా సామాన్యులకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చాలామంది ఫిర్యాదులు చేస్తుంటారు.అందరు ట్రాన్స్‌జెండర్లు జనాల జోలికి వెళ్లరు.

 Video Viral Transgender Woman Assaults Auto Driver In Crowded Market Details, Vi-TeluguStop.com

చాలావరకు మంచోళ్లే ఉంటారు కానీ కొందరు అనవసరంగా ప్రజలపై దాడులకు పాల్పడుతూ మిగతా వారందరికీ కూడా చెడ్డ పేరు తెస్తుంటారు.తాజాగా ఇలాంటి దురుసు ప్రవర్తన గల ట్రాన్స్‌జెండర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆమె ఒక ఆటో డ్రైవర్ తో( Auto Driver ) గొడవ పెట్టుకొని అతడిని దారుణంగా కొట్టింది.

రూ.10 ఇవ్వకుండా తప్పించుకునేందుకు ఈ ట్రాన్స్‌జెండర్ మహిళ చాలా విచిత్రంగా ప్రవర్తించింది.ఆమె ఆటోలో తన గమ్యస్థానానికి వెళ్లాక, డబ్బులు ఇచ్చేది లేదని డ్రైవర్‌తో వాదించడం మొదలుపెట్టింది.

వాళ్ళిద్దరి మధ్య జరిగిన వాదన వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఆ వీడియోలో, వాదన పెద్దది అయ్యి, ఆ ట్రాన్స్‌జెండర్ వుమన్ డ్రైవర్‌ని కొట్టడం మొదలుపెట్టింది.

డ్రైవర్ తనని తాను కాపాడుకునేందుకు ప్రయత్నించాడు.కానీ ఆమె ఆగలేదు.

చివరికి, అనుకోని విధంగా, ఆ ట్రాన్స్‌జెండర్ మహిళ తన ప్యాంట్‌ తీసి, డ్రైవర్‌ని బెదిరించి మరింత కొట్టింది.

సోషల్ మీడియాలో( Social Media ) ఈ వీడియో చాలా వైరల్ అవుతోంది.వీడియోలో ట్రాన్స్‌జెండర్ మహిళ రూ.10/- ఇవ్వకుండా ఆటో డ్రైవర్‌తో గొడవ పడుతోంది.కొంతమంది వీడియోలో ఉన్న వ్యక్తి మహిళ అని, మరికొంతమంది ట్రాన్స్‌జెండర్ అని కామెంట్స్ చేస్తున్నారు.

ఎక్కడ జరిగిందో, ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ, వీడియో గురువారం నాడు నెట్‌లోకి వచ్చింది.చాలా తక్కువ డబ్బులకే ఇంత రచ్చ చేయడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఆ ట్రాన్స్‌జెండర్ మహిళ వల్ల ఆ వర్గానికి చాలా డ్యామేజీ జరిగింది.

ఇలాంటి చిన్న విషయాలకు ఇంత గొడవ ఎందుకు చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు.కోపాన్ని, గొడవలను ఎదుర్కోవడానికి మంచి పద్ధతులు నేర్చుకోవాలి అని ఈ వీడియో చూసి అందరూ అనుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube