రైతు భరోసాపై పూర్తి క్లారిటీ .. నేడు క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ

తెలంగాణలో రైతు భరోసా( Rythu Bharosa ) అమలు చేయడం తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసాను అమలు చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి.

 Cabinet Sub Committee Meeting On Implementation Of Rythu Bharosa For Farmers Det-TeluguStop.com

( CM Revanth Reddy ) తెలంగాణలో రైతు భరోసా అమలుపై ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు తాజాగా క్యాబినెట్ సబ్ కమిటీ ఈరోజు భేటీ కాబోతోంది.హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు మంత్రులు ఆయా శాఖల ప్రధాన కార్యదర్శిలు భేటీ కానున్నారు .ఈ సమావేశంలో ముఖ్యంగా రైతు భరోసా విధివిధానాలు పై సబ్ కమిటీ కసరత్తు చేయనుంది.

Telugu Farmers, Raithu Bharosa, Revanth Reddy, Telanganacm, Telangana-Politics

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) ఏర్పడి ఏడు నెలలు అవుతున్న నేపథ్యంలో, వీలైనంత త్వరగా రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మొన్నటి వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణం గా అనేక సంక్షేమ పథకాలకు అంతరాయం ఏర్పడింది .అయితే ప్రస్తుతం పరిపాలనపై ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా కౌలు రైతులకు కూడా రైతు భరోసా అందిస్తామని హామీని ఇచ్చారు.ఈ మేరకు ఆ హామీని ఎన్నికల మేనిఫెస్టోలో( Election Manifesto ) చేర్చారు.

దీంతో కౌలు రైతులకు కూడా భరోసా అందించే అంశంపై చర్చించేందుకు క్యాబినెట్ సబ్ కమిటీ ఈరోజు భేటీ అవుతుంది.రైతు బంధును సమర్థవంతంగా అమలు చేయాలంటే ప్రభుత్వం దగ్గర కవులు రైతులకు సంబంధించిన సమాచారం , వివరాలు అందుబాటులో లేవు.

Telugu Farmers, Raithu Bharosa, Revanth Reddy, Telanganacm, Telangana-Politics

అందుకే కవులు రైతులను గుర్తించేందుకు సబ్ కమిటీ భేటీలో చర్చించనున్నారు.50,000 మంది రైతుల నుంచి అభిప్రాయ సేకరణ కూడా చేశారు అధికారులు.10 ఎకరాల వరకు ఉన్న వారికి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు .రైతు సంఘాల నుంచి అనేక విజ్ఞప్తులు అందాయి.10 ఎకరాల వారికే కాకుండా తక్కువ పొలంలో కవులు చేసుకుంటున్న కుటుంబాలను కూడా ఆదుకోవాలని కోరారు రైతు సంఘం నాయకులు. దీంతో వారి అభ్యర్థన మేరకు ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు కూడా రైతు భరోసా అందించేందుకు సాధ్యసాధ్యాయాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది.

ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ తర్వాత దీనిపై క్లారిటీ రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube