క్యాడర్ కు ధైర్యం నూరిపొస్తున్న కేసీఆర్ 

పూర్తిగా నిరాశ నిస్పృహల్లో ఉన్న బీఆర్ఎస్( BRS ) క్యాడర్ కు ధైర్యం నింపే పనిలో నిమగ్నం అయ్యారు ఆ పార్టీ అధినేత కెసిఆర్.( KCR )  ఇటీవల కాలంలో పార్టీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి( Congress ) వలస వెళుతుండడం,  ఎమ్మెల్యేలు,  కీలక పదవులు అనుభవించిన నేతలు సైతం రాజీనామా చేస్తుండడం వంటివి క్యాడర్ లో గందరగోళంకు కారణమవుతుంది.

 Kcr Is Giving Courage To The Brs Cadre Details, Brs, Bjp, Telangana Elections, K-TeluguStop.com

ఇదే బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తుపై అనుమానాలు కలిగే విధంగా చేస్తున్నాయి.ఈ నేపథ్యంలోని కెసిఆర్ స్వయంగా రంగంలోకి దిగి క్యాడర్ కు ధైర్యం నింపే పనికి శ్రీకారం చుట్టారు.

Telugu Brs Cadre, Brs, Brs Career, Congress, Cm Kcr, Telangana-Politics

ప్రజాస్వామ్యం లో అధికారం శాశ్వతం కాదు అని,  ప్రతిపక్ష పాత్ర కూడా శాశ్వతం కాదు అని,  మనకు ప్రజా తీర్పే శిరోధార్యం.వారు ఎటువంటి పాత్రను అప్పగిస్తే దానిని చిత్తశుద్ధితో నిర్వహించాలంటూ కేసిఆర్ వ్యాఖ్యానించారు.ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఖమ్మం,  మహబూబాబాద్ ,వేములవాడ,  నర్సాపూర్,  ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ కేడర్ తో కేసీఆర్ సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా కేడర్ కు ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.

అధికారం కోల్పోయామని బాధపడడం సరైన రాజకీయ నాయకుడి లక్షణం కాదు అని,  ప్రజా సంక్షేమం కోసం కొనసాగే నిరంతర ప్రక్రియనే రాజకీయమని కెసిఆర్ అన్నారు.దానికి గెలుపు ఓటములతో సంబంధం ఉండదని , ప్రజల్లో కలిసి ఉంటూ వారి సమస్యలపై నిరంతరం పోరాడుతూ , వారి అభిమానాన్ని పొందాలని కెసిఆర్ సూచించారు.

Telugu Brs Cadre, Brs, Brs Career, Congress, Cm Kcr, Telangana-Politics

ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ నిర్ణయం అని ,  ఏమాత్రం అధైర్య పడవద్దని కార్యకర్తలకు ధైర్యం నింపారు.తెలంగాణలో( Telangana ) అతి తక్కువ సమయంలోనే దేశానికి ఆదర్శంగా పాలన అందించామని,  విద్యుత్, సాగు, తాగునీరు వ్యవసాయం వంటి రంగాల్లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యాచరణ దేశ చరిత్రలో అంతకుముందు ఎవరు చేయని విధంగా కొనసాగిందని కేసీఆర్ అన్నారు.తెలంగాణ వ్యవసాయ ప్రగతిని చూసి మహారాష్ట్ర వంటి పక్క రాష్ట్రాల ప్రజలు తమకు కేసిఆర్ పాలన కావాలని కోరుకున్నారు అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు.  ఈ సందర్భంగా తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ బిజెపి పైన తనదైన శైలిలో కేసిఆర్ సెటైర్లు వేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube