కొండ సురేఖకు పదవీ గండం.. తప్పుకుంటారా తప్పిస్తారా ? 

తెలంగాణ మంత్రి కొండ సురేఖ( Minister Konda Surekha ) మంత్రి పదవి గండం పొంచి ఉన్నట్టే కనిపిస్తుది.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను( KTR ) విమర్శించే క్రమంలో సినీ హీరోయిన్ సమంత ను( Samantha ) ప్రస్తావిస్తూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమరాన్ని రేపుతున్నాయి.

 Telangana Congress Minister Konda Surekha In Trouble Details, Brs, Kcr, Ktr, Tel-TeluguStop.com

దేశవ్యాప్తంగానే ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.ఒక ప్రముఖ హీరోయిన్ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ బహిరంగంగా విమర్శలు చేయడాన్ని అందరూ తప్పుపడుతున్నారు.

ఇప్పటికే ఈ వ్యవహారంలో సమంత తో పాటు,  హీరో నాగార్జున , అమల తో పాటు,  సినీ ప్రముఖులు ఎంతో మంది కొండ సురేఖ వ్యాఖ్యలను తప్పుపట్టారు.సమంత వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి సురేఖ దారుణంగా మాట్లాడడం పై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయంగా కేటీఆర్ ను ఇరుకున పెట్టాను క్రమంలో సురేఖ ఈ వ్యాఖ్యలు చేసినా,  ఆమె వ్యక్తిగత జీవితానికి,  రాజకీయ జీవితానికి ఇది ఇబ్బందికరంగానే మారబోతుంది.

Telugu Brs, Konda Surekha, Naga Chaitanya, Nagarjuna, Rahul Gandhi, Samantha, Te

ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆపాలంటే సమంతను తన దగ్గర కు పంపించాలని కేటీఆర్ అడిగాడని , నాగార్జున, నాగచైతన్య సమంత పైన ఈ విషయంలో ఒత్తిడి తెచ్చారని , దీనికి సమంత అంగీకరించకపోవడంతోనే నాగచైతన్య( Naga Chaitanya ) విడాకులు ఇచ్చారని కొండ సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.దీనిపైనే ఆమెపై సర్వత్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.సురేఖ మంత్రి పదవికి అనర్హురాలని,  ఆమెను వెంటనే మంత్రి పదవి నుంచి తప్పించాలని ,అలాగే కాంగ్రెస్( Congress ) నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.

ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి ఒక మహిళ విషయంలో అత్యంత దారుణంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కి( Rahul Gandhi ) కొండ సురేఖ పై ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం.

Telugu Brs, Konda Surekha, Naga Chaitanya, Nagarjuna, Rahul Gandhi, Samantha, Te

అలాగే నాగచైతన్య,  నాగార్జున ,సమంత అభిమానులు కూడా కొండ సురేఖ పై సోషల్ మీడియాలో ట్రొలింగ్ చేస్తున్నారు .త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఉన్నారు.ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం పెద్దల తోను ఆయన భేటీ అయ్యారు.మంత్రివర్గ ప్రక్షాళన చేసేందుకు ఈ దసరాను ముహూర్తంగా పెట్టుకున్న క్రమంలోనే అనూహ్యంగా కొండా సురేఖ వివాదాల్లో చిక్కుకోవడంతో ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించి ఆమె స్థానంలో మరొకరికి మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం తెరపైకి వస్తోంది.

అయితే అంతకంటే ముందుగానే కొండా సురేఖ తన పదవికి రాజీనామా చేస్తారా లేక కాంగ్రెస్ అధిష్టానం పెద్దలే ఆమెను తప్పిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube