కొండ సురేఖకు పదవీ గండం.. తప్పుకుంటారా తప్పిస్తారా ?
TeluguStop.com
తెలంగాణ మంత్రి కొండ సురేఖ( Minister Konda Surekha ) మంత్రి పదవి గండం పొంచి ఉన్నట్టే కనిపిస్తుది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను( KTR ) విమర్శించే క్రమంలో సినీ హీరోయిన్ సమంత ను( Samantha ) ప్రస్తావిస్తూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమరాన్ని రేపుతున్నాయి.
దేశవ్యాప్తంగానే ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.ఒక ప్రముఖ హీరోయిన్ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ బహిరంగంగా విమర్శలు చేయడాన్ని అందరూ తప్పుపడుతున్నారు.
ఇప్పటికే ఈ వ్యవహారంలో సమంత తో పాటు, హీరో నాగార్జున , అమల తో పాటు, సినీ ప్రముఖులు ఎంతో మంది కొండ సురేఖ వ్యాఖ్యలను తప్పుపట్టారు.
సమంత వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి సురేఖ దారుణంగా మాట్లాడడం పై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయంగా కేటీఆర్ ను ఇరుకున పెట్టాను క్రమంలో సురేఖ ఈ వ్యాఖ్యలు చేసినా, ఆమె వ్యక్తిగత జీవితానికి, రాజకీయ జీవితానికి ఇది ఇబ్బందికరంగానే మారబోతుంది.
"""/" /
ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆపాలంటే సమంతను తన దగ్గర కు పంపించాలని కేటీఆర్ అడిగాడని , నాగార్జున, నాగచైతన్య సమంత పైన ఈ విషయంలో ఒత్తిడి తెచ్చారని , దీనికి సమంత అంగీకరించకపోవడంతోనే నాగచైతన్య( Naga Chaitanya ) విడాకులు ఇచ్చారని కొండ సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీనిపైనే ఆమెపై సర్వత్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.సురేఖ మంత్రి పదవికి అనర్హురాలని, ఆమెను వెంటనే మంత్రి పదవి నుంచి తప్పించాలని ,అలాగే కాంగ్రెస్( Congress ) నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి ఒక మహిళ విషయంలో అత్యంత దారుణంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కి( Rahul Gandhi ) కొండ సురేఖ పై ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం.
"""/" /
అలాగే నాగచైతన్య, నాగార్జున ,సమంత అభిమానులు కూడా కొండ సురేఖ పై సోషల్ మీడియాలో ట్రొలింగ్ చేస్తున్నారు .
త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఉన్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం పెద్దల తోను ఆయన భేటీ అయ్యారు.మంత్రివర్గ ప్రక్షాళన చేసేందుకు ఈ దసరాను ముహూర్తంగా పెట్టుకున్న క్రమంలోనే అనూహ్యంగా కొండా సురేఖ వివాదాల్లో చిక్కుకోవడంతో ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించి ఆమె స్థానంలో మరొకరికి మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం తెరపైకి వస్తోంది.
అయితే అంతకంటే ముందుగానే కొండా సురేఖ తన పదవికి రాజీనామా చేస్తారా లేక కాంగ్రెస్ అధిష్టానం పెద్దలే ఆమెను తప్పిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
స్టార్ హీరో అల్లు అర్జున్ కు ఫోన్ చేసిన బాలయ్య.. అసలేం జరిగిందంటే?