తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతుంది.ఇక ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీ లోకి కొత్త కథలు రావడమే కాకుండా తమదైన రీతిలో సినిమాలను చేయడానికి మన దర్శకులు( Directors ) సైతం పోటీ పడుతున్నారు.
ఇక మన వాళ్ల సినిమాలను చూడడానికి యావత్ ఇండియాలో ఉన్న అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండడం విశేషం మరి మొత్తానికైతే స్టార్ డైరెక్టర్లే కాకుండా యంగ్ డైరెక్టర్లు కూడా వాళ్ళ సినిమాలతో మ్యాజిక్ ను చేస్తున్నారు.

ఇలాంటి క్రమంలో రాహుల్ సంకృత్యన్ , ప్రశాంత్ వర్మ, నాగ్ అశ్విన్, వివేక్ ఆత్రేయ( Rahul Sankrityan, Prashant Verma, Nag Ashwin, Vivek Atreya ) లాంటి దర్శకులు మంచి పేరును సంపాదించుకొని ముందుకు సాగుతున్నారు.ఇక ఇప్పుడున్న దర్శకులు కూడా వీళ్ల బాటలో నిలవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక ఇప్పుడున్న యంగ్ దర్శకులు అందరూ మంచి కథలతో సినిమా చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.
మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల పట్ల ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉంటున్నాయి.ఇక దానికి అనుగుణంగానే మన తెలుగు సినిమాల్లోని డైరెక్టర్లను బాలీవుడ్ హీరోలు ( Bollywood heroes )సైతం అవకాశాలను ఇస్తు వాళ్లతో సినిమాలు చేయడానికి ముందుకు సాగుతున్నారు.
అంటే మన వాళ్ల టాలెంట్ అంత ఇంత కాదనే చెప్పాలి.

ఇక తనదైన రీతిలో దూసుకుపోతే మరో 10 సంవత్సరాల వరకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీని టచ్ చేసే ఇండస్ట్రీ ఉండదని చెప్పడంలో ఎంత మాత్రం శక్తి లేదు ఇప్పటికే మన స్టార్ దర్శకులు వరుస సినిమాలు చేసుకునే ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక బాలీవుడ్ ప్రేక్షకులు సైతం మన దర్శకుల సినిమాలను చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు.అందుకే బాలీవుడ్ హీరోలు కూడా తెలుగు సినిమా దర్శకులను ఎక్కువగా నమ్ముతున్నారు… చూడాలి మరి తమ తదుపరి సినిమాతో వాళ్ళు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు అనేది…
.