సినీ ఇండస్ట్రీలో ఎంతో స్టార్ సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలో అక్కినేని ఫ్యామిలీ ( Akkineni Family ) ఒకటి అక్కినేని నాగేశ్వరరావు ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్నారు.ఇక ఈయన వారసుడిగా నాగార్జున( Nagarjuna ) ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మరింత గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇక ప్రస్తుతం అక్కినేని కుటుంబానికి ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.అలాగే అక్కినేని కుటుంబం కూడా పెద్ద ఎత్తున వరుస వివాదాలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే.
అక్కినేని కుటుంబంలో అందరికీ కూడా దాదాపు పెళ్లిళ్లు జరిగే విడాకులు తీసుకొని విడిపోవడం, రెండో పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది.ఈ విషయం గురించి తరచూ అక్కినేని ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.నాగార్జున కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు.ఇక నాగ చైతన్య కూడా రెండో పెళ్లికి సిద్ధమయ్యారు.అఖిల్ నిశ్చితార్థం బ్రేకప్ చేసుకున్న సంగతి తెలిసిందే.ఇటీవల నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో నిశ్చితార్థం కూడా జరిగింది.
ఈ నిశ్చితార్థపు ఫోటోలు వైరల్ కావడంతో అక్కినేని ఫ్యామిలీ మరోసారి వార్తలో నిలిచారు.
ఇక శోభితతో నిశ్చితార్థం అయిన కొద్ది రోజుల తర్వాతనే తెలంగాణ ప్రభుత్వం ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చి వేసింది.దీంతో మరోసారి ఈ కుటుంబం వార్తల్లో నిలిచారు.ఇదిలా ఉండగా తాజాగా మరోసారి అక్కినేని ఫ్యామిలీ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ ( Konda Surekha ) సమంత ( Samantha ) నాగచైతన్య విడిపోవడానికి కారణం కేటీఆర్ అంటూ కామెంట్లు చేయడమే కాకుండా కేటీఆర్ రూమ్ కి సమంత నాగార్జుననే పంపించారు అంటూ సంచలనమైన ఆరోపణలు చేయడంతో మరోసారి వార్తలో నిలిచారు.అయితే ఈ విషయంపై అక్కినేని కుటుంబానికి మద్దతుగా ఇండస్ట్రీ మొత్తం నిలబడింది.
ఇక నాగార్జున సైతం ఈ వార్తలపై మండిపడటమే కాకుండా తనపై పరువు నష్టం దావా కూడా వేశారు.ఇలా అక్కినేని కుటుంబం తరచూ వార్తలలో నిలవడంతో ఏదైనా దోషాలు ఉన్నాయా అందుకే ఇలాంటి వివాదాలను ఎదుర్కొంటున్నారా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.