కొండ సురేఖ వివాదం .. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి విన్నపం 

సినీ ప్రముఖులపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ( Minister Konda Surekha ) చేసిన విమర్శల నేపథ్యంలో,  కాంగ్రెస్ పైన తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతుండడం,  ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు తీవ్ర ఆగ్రహంతో ఉండడంతో,  తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్( Mahesh Kumar Goud ) రంగంలోకి దిగారు.  మంత్రి కొండా సురేఖ సినీ ప్రముఖుల కు సంబంధించి చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో,  మహేష్ కుమార్ గౌడ్ ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం మొదలుపెట్టారు.

 Pcc Chief Mahesh Kumar Goud Reacts On Konda Surekha Comments Details, Konda Sure-TeluguStop.com

ఈ మేరకు సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలకు మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.భవిష్యత్తుకు భరోసా కల్పించారు.

సినిమా ఇండస్ట్రీపై మంత్రి కొండ సురేఖ చేసిన కామెంట్స్ కు పుల్ స్టాప్ పెట్టేశారు.

Telugu Konda Surekha, Pcc, Pccmahesh, Samantha-Politics

మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు విచారకరమని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.  ఆ మంత్రి వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని, ఇంతటితో ఈ విషయాన్ని వదిలిపెట్టాలని సినీ ప్రముఖులకు ఆయన విజ్ఞప్తి చేశారు.రాబోయే రోజుల్లోనూ సినీ రంగానికి చెందిన వ్యక్తులను రాజకీయ వివాదాల్లోకి లాగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు.

Telugu Konda Surekha, Pcc, Pccmahesh, Samantha-Politics

మహిళా మంత్రి కొండ సురేఖ మీద బీఆర్ఎస్ నేత కేటీఆర్( KTR ) సోషల్ మీడియాలో చేయించిన ట్రోల్స్ ని అందరూ చూశారని మహేష్ కుమార్ గౌడ్ వివరించారు .ఆ ట్రోల్స్ నేపథ్యంలోనే మంత్రి సురేఖ ఆ వ్యాఖ్యలు చేశారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.ఎవరి మీద ఎవరు వ్యాఖ్యలు చేసినా,  సమాజానికి మంచిది కాదు అన్నారు.  ఏది ఏమైనప్పటికీ ఇలాంటి అభ్యంతర వ్యాఖ్యలు ఎవరూ చేయకూడదని వివరించారు.కొండా సురేఖ,  కేటీఆర్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం ఏమిటనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.

కొండ సురేఖను అవమానించేలా బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోల్స్ కు దిగడం పై బీఆర్ఎస్ అధిష్టానం మంత్రికి క్షమాపణలు చెబుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

బీఆర్ఎస్ క్షమాపణలు చెబితే హుందాగా ఉంటుందని కొంతమంది రాజకీయ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.ఈ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందేననే డిమాండ్ ను కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube