సోషల్ మీడియాను ఊపేస్తున్న తెలంగాణ ఫోక్ సాంగ్ సీమ దసరా చిన్నోడు.. రీల్స్ నిండా ఆ పాట స్టెప్పులే!!

కొన్నేళ్లుగా తెలంగాణ ఫోక్ సాంగ్స్ ( Telangana Folk Songs )యూట్యూబ్‌తో పాటు అన్ని సోషల్ మీడియా యూజర్లను ఉర్రూతలూగిస్తున్నాయి.ఏ సోషల్ మీడియా సైట్ చూసుకున్నా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు తెలంగాణ జానపద పాటలకే స్టెప్పులు వేస్తూ కనిపిస్తున్నారు.కొద్ది నెలల క్రితం మోహన భోగరాజు అద్భుతంగా పాడిన “బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా.” పాట సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.తెలుగు రాష్ట్రాలవ్యాప్తంగా ఈ పాట పెళ్లి డీజేలలో మార్మోగింది.ఈ పాటకు దాదాపు ప్రతి ఒక్కరూ అద్భుతంగా డ్యాన్స్ చేసే అదరగొట్టారు.వరుడు ఎదుట వధువు పాడే ఈ పాట హిట్ అయినట్టు ఇప్పటిదాకా మరే పాట హిట్ కాలేదంటే అతిశయోక్తి కాదు.

 Seema Dasara Chinnode Viral In Reels, Seema Dasara Chinnode, Insta, Reels , Tela-TeluguStop.com
Telugu Insta, Reels, Seemadasara-Telugu Stop Exclusive Top Stories

రీసెంట్‌గా దసరా సినిమాలోని చమ్కీల అంగీలేసి పాట హిట్ అయింది కానీ అది బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా పాట ఊపేసినంతగా ప్రజలను ఊపేయలేదు.ఈ సినిమా పాట కాక యూట్యూబ్‌లో చాలానే జానపద పాటలు మంచి లిరిక్స్, మ్యూజిక్‌, ట్యూన్స్‌తో సూపర్ హిట్ అవుతుంటాయి.వాటిలో నాగదుర్గ ఫోక్ సాంగ్స్ ( Nagadurga Folk Songs )ముందు వరసలో ఉంటుంటాయి.

ఈ ముద్దుగుమ్మ జానపద పాటలకు తగ్గట్టుగా డ్యాన్సులు వేస్తూ, ముచ్చటైన హావభావాలతో ఆకట్టుకుంటుంది.ఈ తార నటించిన ప్రైవేట్ వీడియో సాంగ్స్‌లో కాపోళ్ల ఇంటికాడ కాముడాటనట, నా గుండెలో బాధ నీ గుండెకు గుర్తొస్తలేదా, ఉరుముల రమ్మంటినే బాగా హిట్ అయ్యాయి.

Telugu Insta, Reels, Seemadasara-Telugu Stop Exclusive Top Stories

ఇక ఫోక్ మూవీ సాంగ్స్ విషయానికి వస్తే రీసెంట్ టైమ్‌లో పల్సర్ బైక్, దండకడియాల్, జింతాక్ పాటలు బంపర్ హిట్ అయ్యాయి.ఈ పాటలకు డ్యాన్స్‌లు వేయడం అందరికీ సాధ్యం కాదు.అందుకే సింపుల్‌గా ఉండే డ్యాన్సులు వేసేందుకు సోషల్ మీడియా యూజర్లు వేరే ఫోక్ సాంగ్స్ ఎంచుకుంటున్నారు.కాగా వారందరికీ ఇప్పుడు ఒకటి సూపర్ ఫేవరెట్ అయింది.అదే “కెమెరా పట్టినడో సీమ దసరా చిన్నోడు” పాట.నిజానికి ఈ పాటలోని డ్యాన్స్ ఒక కొరియన్ సాంగ్ నుంచి కాపీ కొట్టారు.

ఇందులో ఒక యువతికి కొందరు గొడుగు పట్టుకుని ఉండగా ఆమె వెనుక కెమెరామ్యాన్ వస్తూ ఫోటోలు తీస్తుంటాడు.కెమెరామెన్, ఆ యువతి ఇద్దరూ కూడా ఒక రిథమ్‌లో డ్యాన్స్ చేస్తుంటారు.

ఈ స్టెప్పులు చాలా సింపుల్ కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ సింపుల్ డ్యాన్స్ స్టెప్పులను వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.రీల్స్‌లో, యూట్యూబ్ షార్ట్స్‌లో ఫేస్‌బుక్ షార్ట్ వీడియోలలో ఎక్కడ చూసినా ఈ పాట స్టెప్పులే కనిపిస్తున్నాయి.

సినిమా సాంగ్స్ కంటే ఈ పాట ప్రజలకు బాగా నచ్చుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube