తరచుగా సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుండడం చూస్తూనే ఉంటాము.ఇందులో కొన్ని నవ్వు తెప్పించంగా విధంగా ఉంటే.
మరికొన్ని భయాన్ని, అలాగే ఆశ్చర్యాన్ని కలగజేసేలా ఉంటాయి.ఇకపోతే, తాజాగా సోషల్ మీడియాలో ఓ భయానకరమైన వీడియో వైరల్ అవుతుంది.
ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా శరీరం వణుకు పుడుతుంది.ఇంత భయంకరమైన వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.
ఇండోనేషియాలోని పట్టాయా పటానికి చెందిన ఈ వీడియో ఓ వ్యక్తి తన ప్రాణాలతో చెలగాటం ఆడినట్లుగా కనబడుతుంది.ఈ వీడియోలో యువకుడు మొసలితో విన్యాసాలు చేయడం కనపడుతుంది.వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం.ఓ ముసలి నీటి వద్దకు వచ్చి విశ్రాంతి తీసుకుంటుంది.ఆ సమయంలో ఓ యువకుడు వేగంగా వచ్చి ఆ మోసలని టచ్ చేసి చూశాడు.అలా చేసిన కానీ ఆ మొసలి ఏమాత్రం స్పందించకపోవడం విశేషం.
ఇంకేముంది ఆ యువకుడు ఆ తర్వాత రెచ్చిపోయాడు.అలా ఆ యువకుడు మొదట మొసలి నోట్లో తన చెయ్యి పెట్టాడు.
అయితే, ఆ సమయంలో ఒక్కసారిగా మొసలి అతడి చేతిని పట్టేందుకు ప్రయత్నం చేసింది.అయితే ఆ సమయంలో సదరు యువకుడు వేగంగా స్పందించి తన చేతిని వెనక్కు లాగేసుకున్నాడు.
ఆ తర్వాత మొసలి తిరిగి నీటిలోకి వెళ్లిపోయింది.దాంతో ఆ యువకుడు తన చేతికి ఆయన గాయాన్ని చూసుకొని నవ్వుతూ వెనక్కి వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత మళ్లీ మరో భారీ మొసలి నీటిలోంచి బయటికి వచ్చి నోరు పెద్దదిగా తెరుచుకొని పడుకొని ఉంది.ఆ సమయంలో ఆ యువకుడు మొసలి నోట్లో తల పెట్టుకొని పడుకోవడం గమనించవచ్చు.వీడియోలో గమనించినట్లయితే ఆ యువకుడు ఏదో చెబుతున్నట్లుగా అర్థమవుతుంది.ఇక్కడ విడ్డూరమేంటంటే.మొసలిని అతడు టచ్ చేయలేదు.అందుకే అతడు ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పవచ్చు.
ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు భయభ్రాంతులకు లోనవుతున్నారు.ఆ యువకుడికి ఏమైనా పిచ్చా.? ప్రాణాలు పోతే ఎలా అంటూ కొందరు ఘాటుగా స్పందిస్తుంటే.మరికొందరేమో, నీకు ఏదో రోజు మూడింది అంటూ మరికొందరు కామెంట్ చేసారు.
తాజా వార్తలు