వేడెవడండీ బాబు.. ఏకంగా మొసలి నోట్లోనే తలపెట్టేసాడు.!(వీడియో)
TeluguStop.com
తరచుగా సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుండడం చూస్తూనే ఉంటాము.
ఇందులో కొన్ని నవ్వు తెప్పించంగా విధంగా ఉంటే.మరికొన్ని భయాన్ని, అలాగే ఆశ్చర్యాన్ని కలగజేసేలా ఉంటాయి.
ఇకపోతే, తాజాగా సోషల్ మీడియాలో ఓ భయానకరమైన వీడియో వైరల్ అవుతుంది.ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా శరీరం వణుకు పుడుతుంది.
ఇంత భయంకరమైన వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే. """/" /
ఇండోనేషియాలోని పట్టాయా పటానికి చెందిన ఈ వీడియో ఓ వ్యక్తి తన ప్రాణాలతో చెలగాటం ఆడినట్లుగా కనబడుతుంది.
ఈ వీడియోలో యువకుడు మొసలితో విన్యాసాలు చేయడం కనపడుతుంది.వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం.
ఓ ముసలి నీటి వద్దకు వచ్చి విశ్రాంతి తీసుకుంటుంది.ఆ సమయంలో ఓ యువకుడు వేగంగా వచ్చి ఆ మోసలని టచ్ చేసి చూశాడు.
అలా చేసిన కానీ ఆ మొసలి ఏమాత్రం స్పందించకపోవడం విశేషం.ఇంకేముంది ఆ యువకుడు ఆ తర్వాత రెచ్చిపోయాడు.
అలా ఆ యువకుడు మొదట మొసలి నోట్లో తన చెయ్యి పెట్టాడు.అయితే, ఆ సమయంలో ఒక్కసారిగా మొసలి అతడి చేతిని పట్టేందుకు ప్రయత్నం చేసింది.
అయితే ఆ సమయంలో సదరు యువకుడు వేగంగా స్పందించి తన చేతిని వెనక్కు లాగేసుకున్నాడు.
ఆ తర్వాత మొసలి తిరిగి నీటిలోకి వెళ్లిపోయింది.దాంతో ఆ యువకుడు తన చేతికి ఆయన గాయాన్ని చూసుకొని నవ్వుతూ వెనక్కి వెళ్ళిపోయాడు.
"""/" /
ఆ తర్వాత మళ్లీ మరో భారీ మొసలి నీటిలోంచి బయటికి వచ్చి నోరు పెద్దదిగా తెరుచుకొని పడుకొని ఉంది.
ఆ సమయంలో ఆ యువకుడు మొసలి నోట్లో తల పెట్టుకొని పడుకోవడం గమనించవచ్చు.
వీడియోలో గమనించినట్లయితే ఆ యువకుడు ఏదో చెబుతున్నట్లుగా అర్థమవుతుంది.ఇక్కడ విడ్డూరమేంటంటే.
మొసలిని అతడు టచ్ చేయలేదు.అందుకే అతడు ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పవచ్చు.
ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు భయభ్రాంతులకు లోనవుతున్నారు.ఆ యువకుడికి ఏమైనా పిచ్చా.
? ప్రాణాలు పోతే ఎలా అంటూ కొందరు ఘాటుగా స్పందిస్తుంటే.మరికొందరేమో, నీకు ఏదో రోజు మూడింది అంటూ మరికొందరు కామెంట్ చేసారు.
Bets 10 Bonuses And Promotions: A Practical Welcome Bonus Breakdown