తిరుమల శ్రీవారి లడ్డు( Tirumala Laddu ) వివాదం పై రాజకీయ విమర్శలు ఒకవైపు కొనసాగుతూ అండగానే ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు( Supreme Court ) వెళ్ళింది .ఇప్పటికే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) వ్యాఖ్యానించడాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పు పట్టింది.కీలకమైన పదవుల్లో ఉన్నవారు ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని , కల్తీ జరిగిందనేదానికి ఆధారాలు లేవని వ్యాఖ్యానించింది.
కోట్ల మంది భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని హితవు పలికింది.

ఇది ఇలా ఉంటే, నేడు సుప్రీంకోర్టులో తిరుమల లడ్డు వివాదంపై విచారణ జరగనుంది. స్వతంత్ర దర్యాప్తుపై సుప్రీంకోర్టు న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది. ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కె.వి విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరుపనుంది.సిట్( SIT ) కొనసాగించాలా లేక స్వతంత్ర దర్యాప్తు వేయాలా అనే అంశంపై సోలిసెట్ జనరల్ తుషార్ మొహతాను అభిప్రాయం చెప్పాలని సుప్రీంకోర్టు సూచించింది.తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వులను కలిపారు అన్న చంద్రబాబు ఆరోపణల పై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ

బిజెపి సీనియర్ నేత, ప్రముఖ ఆర్థిక వేత్త డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి( Subramanian Swamy ) సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు లడ్డు కి వినియోగించే నెయ్యి కల్తీ వ్యవహారంలో దర్యాప్తు , స్వతంత్ర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు విచారణ న్యాయమూర్తిని నియమించాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్సిపి సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి( YV Subbareddy ) కూడా ఫిల్ దాఖలు చేశారు.ఇదే అంశంపై ఇతర రాష్ట్రాలకు చెందిన సంపత్ శ్రీధర్, సురేష్, చవాంకే వేరువేరుగా రెండు పిటిషన్లను దాఖలు చేశారు.ఈ నాలుగు వ్యాజ్యాలను సెప్టెంబర్ 30న విచారించింది.
ఈ క్రమంలో నేడు ఈ వివాదంలో సుప్రీంకోర్టు చెప్పబోయే తీర్పు పైనే అందరికీ ఆసక్తి నెలకొంది.