బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను( KTR ) విమర్శించే క్రమంలో సినీ ప్రముఖులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి కొండ సురేఖ పై( Minister Konda Surekha ) అనేక విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ముఖ్యంగా సమంత,( Samantha ) నాగచైతన్య( Naga Chaitanya ) విడాకులకు కేటీఆర్ కారణమని కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.
సినీ ఇండస్ట్రీ ప్రముఖులంతా ఈ వ్యవహారంపై స్పందిస్తూ కొండా సురేఖ వ్యవహార శైలిని తప్పుపట్టారు.అలాగే నాగార్జున ,అక్కినేని అమల, సమంత, నాగచైతన్య తో పాటు చాలామంది సినీ ప్రముఖులే స్పందించి రాజకీయాల్లోకి సినీ ప్రముఖులను లాగ వద్దంటూ హితవు పలుకుతూ కొండా సురేఖ వ్యాక్యాలను తప్పుపట్టారు.
కొండా సురేఖ కేటీఆర్ ను మాత్రమే కాకుండా నాగార్జున సమంత రకుల్ ప్రీతిసింగ్ వంటి వారి పేర్లను ప్రస్తావించడం, సమంత విడాకులకు ఎన్ కన్వెన్షన్ వ్యవహారానికి లింకు పెట్టు మరి విమర్శలు చేశారు.హీరోయిన్లకు మత్తుమందు ఇచ్చి బ్లాక్ మెయిల్ చేశాడని, రకుల్ ప్రీతిసింగ్ త్వరగా పెళ్లి చేసుకోవడానికి కేటీఆర్ కారణం అని కొండ సురేఖ విమర్శలు చేయడం రాజకీయ వర్గాలతో పాటు, సినీ ఇండస్ట్రీలోనూ సంచలనంగా మారింది.
బిజెపి ఎంపీ రఘునందన్ రావు( MP Raghunandan Rao ) ఓ సమావేశంలో కొండ సురేఖ కు నూలు దండ వేయడంపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో సురేఖను ట్రోల్ చేయడంతో ఈ వివాదం మొదలైంది.ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోలింగ్ పాల్పడుతున్నా, కేటీఆర్ స్పందించడం లేదని , మహిళల విషయంలో కేటీఆర్ వైఖరిని తప్పుపడుతూ కొండా సురేఖ గత బీఆర్ఎస్ ప్రభుత్వం లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు, సినీ ప్రముఖుల వ్యవహారాలకు మూడు పెట్టి కేటీఆర్ ను టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు అప్పటివరకు కొండా సురేఖ విషయంలో అందరిలోనూ సానుభూతి కనిపించినా, ఆమె చేసిన విమర్శలు తర్వాత ఆమె సానుభూతి కోల్పోవడంతో పాటు , విమర్శల పాలయ్యారు.కొంతమంది కాంగ్రెస్ నేతలు మినహా ,
మిగిలిన వారు ఎవరు సురేఖ వ్యాఖ్యలను సమర్థించలేదు.ఇక ఈ వ్యవహారం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారడంతో పాటు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.అలాగే మహిళా కమిషన్ కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.కేటీఆర్ ను దృష్టిలో పెట్టుకుని కొండ సురేఖ విమర్శలు చేసినా ఇప్పుడు ఈ వ్యవహారం పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది.
ఇలా అన్ని వైపుల నుంచి కొండ సురేఖ విషయంలో కాంగ్రెస్ పై ఒత్తిడి వస్తోంది.ఇప్పటికే కొండా సురేఖ ఈ వ్యవహారంపై క్షమాపణ చెప్పినా, ఈ వ్యవహారం ఇప్పట్లో సర్ధుమణిగేలా కనిపించడం లేదు.
రాజకీయంగాను, వ్యక్తిగతంగానూ కొండ సురేఖ ప్రతిష్టకు ఈ వ్యవహారం మచ్చ తెచ్చిందనే చెప్పాలి.